Stephen Ravindra: గంజాయి గ్యాంగ్స్‌ను పట్టుకున్నాం..
ABN, First Publish Date - 2023-09-12T15:30:36+05:30
హైదరాబాద్: మహారాష్ట్ర, హర్యానాకు చెందిన గంజాయి గ్యాంగ్‌లను పట్టుకున్నామని, రెండు కేసుల్లో కలిపి రూ. మూడు కోట్లకు పైగా విలువైన 1,228 కిలోల గంజాయి, ఒక పిస్టల్, మూడు వెహికిల్స్ స్వాధీనం చేసుకున్నామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
హైదరాబాద్: మహారాష్ట్ర (Maharastra), హర్యానా (Haryana)కు చెందిన గంజాయి (Marijuana) గ్యాంగ్ (Gang)లను పట్టుకున్నామని, రెండు కేసుల్లో కలిపి రూ. మూడు కోట్లకు పైగా విలువైన 1,228 కిలోల గంజాయి, ఒక పిస్టల్, మూడు వెహికిల్స్ స్వాధీనం చేసుకున్నామని సైబరాబాద్ (Cyberabad) సీపీ స్టీఫెన్ రవీంద్ర (CP Stephen Ravindra) తెలిపారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెండు వెహికిల్స్‌లో గంజాయి ట్రాన్స్‌ఫర్ చేస్తుండగా పట్టుకున్నామన్నారు. అరకు నుంచి షోలాపూర్, ఔరంగబాద్‌కు గంజాయి రవాణా చేస్తున్నారని, పైలట్ వెహికిల్ పెట్టుకుని గంజాయి ట్రాన్స్‌పోర్టు చేస్తున్నారని చెప్పారు. ఒక డీసీఎంలో గంజాయి తరలిస్తుండగా వారిని చేజ్ చేసి పట్టుకున్నామన్నారు. రెండు కేసుల్లో కలిపి ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని, నిందితులపై గతంలో కూడా కేసులున్నాయన్నారు. ఏపీ నుంచి మహారాష్ట్రకు తెలంగాణ మీదుగా గంజాయి ట్రాన్స్‌పోర్టు చేస్తున్నారని సీపీ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు.
Updated Date - 2023-09-12T15:30:36+05:30 IST