BJP: ఆఖరి నిమిషంలో ఆగిన కృష్ణాయాదవ్ చేరిక
ABN, First Publish Date - 2023-08-31T10:54:35+05:30
హైదరాబాద్: చేరికల అంశంలో బీజేపీ ముఖ్యనేతల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మధ్య గ్యాప్ రావడంతో మాజీమంత్రి కృష్ణాయాదవ్ చేరిక ఆఖరి నిమిషంలో ఆగిపోయింది. ఈటల ద్వారా బీజేపీలో చేరడానికి కృష్ణాయాదవ్ ప్రయత్నించారు.
హైదరాబాద్: చేరికల అంశంలో బీజేపీ (BJP) ముఖ్యనేతల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy), ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajendar) మధ్య గ్యాప్ రావడంతో మాజీమంత్రి కృష్ణాయాదవ్ (Krishna Yadav) చేరిక ఆఖరి నిమిషంలో ఆగిపోయింది. ఈటల ద్వారా బీజేపీలో చేరడానికి కృష్ణాయాదవ్ ప్రయత్నించారు. అయితే తనను సంప్రదించకపోవటంతో.. కృష్ణాయాదవ్ చేరికను కిషన్ రెడ్డి వాయిదా వేశారు. హిమాయత్‌నగర్ నియోజకవర్గంలో గతంలో ప్రత్యర్థులుగా కిషన్ రెడ్డి, కృష్ణాయాదవ్ ఉన్నారు. బీజేపీలో చేరకముందే అంబరుపేట నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని కృష్ణాయాదవ్ ప్రకటించారు. తన సొంత నియోజకవర్గం అంబరుపేటపై కృష్ణాయాదవ్ కన్నేయటంతో కిషన్ రెడ్డి అప్రమత్తమయ్యారు.
మరోవైపు మాజీ గవర్నర్ విద్యాసాగరరావు (Vidyasagar Rao) తనయుడు వికాస్ రావు (Vikas Rao) చేరిక కార్యక్రమానికి బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ దురంగా ఉన్నారు. వికాస్ రావు బీజేపీలో చేరికపై ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ.. ఆయన సంగారెడ్డిలో పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. వేములవాడ టికెట్ ఈటల వర్గం నాయకురాలు తుల ఉమ ఆశిస్తున్నారు. అయితే వేములవాడ టికెట్ హామీతోనే చెన్నమనేని వికాస్ రావు కాషాయ కండువా కప్పుకున్నట్లు సమాచారం. విద్యాసాగరరావు తనయుడు కావటంతో చెన్నమనేని వికాస్ వైపు కిషన్ రెడ్డి మెగ్గు చూపుతున్నారు. చేరికల కమిటీ ఛైర్మన్, ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్‌గా ఉండి చేరికల కార్యక్రమానికి ఈటల దూరంగా ఉండటంపై బీజేపీలో చర్చ జరుగుతోంది.
Updated Date - 2023-08-31T10:54:35+05:30 IST