ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BJP Pitition: బండి సంజయ్ అరెస్ట్‌పై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌లో ఏముందంటే..

ABN, First Publish Date - 2023-04-05T13:06:03+05:30

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్ట్‌‌పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ (BJP Leader Bandi Sanjay)అక్రమ అరెస్ట్‌‌పై తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో పిటిషన్ దాఖలైంది. బండి సంజయ్‌ను అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు సాంరెడ్డి సురేందర్ రెడ్డి (Hyderabad District President Sanreddy Surender Reddy) హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌ (Habeas corpus petition)ను దాఖలు చేశారు. మొత్తం ఆరుగురిని బీజేపీ ప్రతివాదులుగా చేర్చింది. హోం శాఖ కార్యదర్శి, డీజీపీ, కరీంనగర్ రాచకొండ సీపీలు, బొమ్మలరామారం సీఐలను ప్రతివాదులుగా చేర్చుతూ బీజేపీ పిటిషన్‌ను దాఖలు చేసింది. బండి సంజయ్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని... అరెస్టు సమయంలో పాటించాల్సిన కనీస నిబంధనలు పోలీసులు పాటించలేదని పేర్కొన్నారు. అరెస్టు విషయాన్ని కుటుంబ సభ్యులకు, పార్టీ సభ్యులకు పోలీసులు వెల్లడించలేదని తెలిపారు. సీఆర్పీసీ 50 కింద అరెస్టు విషయాన్ని తప్పనిసరిగా కుటుంబ సభ్యులకి చెప్పాలని అన్నారు. తన అత్తగారి 10వ దినంకు హాజరుకావాల్సి ఉన్నందున బండి సంజయ్‌ కరీంనగర్‌ (Karimnagar)కు వెళ్లారని.. రాత్రి 11:30 నిమిషాలకు అక్రమంగా బండి సంజయన్‌ను అరెస్టు చేశారని పిటిషన్‌లో బీజేపీ పేర్కొంది. మరికాసేపట్లో బీజేపీ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకోనున్నారు.

Updated Date - 2023-04-05T13:06:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising