ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు నోటీసులు

ABN, First Publish Date - 2023-07-18T14:14:21+05:30

హైదరాబాద్: బీఆర్ఎస్‌కు కోకాపేటలో 11 ఎకరాల భూమి కేటాయింపుపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి ఆదేశించింది.

హైదరాబాద్: బీఆర్ఎస్‌ (BRS)కు కోకాపేటలో 11 ఎకరాల భూమి కేటాయింపుపై హైకోర్టు (High Court) మంగళవారం విచారణ జరిపింది. ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు నోటీసులు (Notices) జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి ఆదేశించింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్‌ (Forum for Good Governance Pill)పై హైకోర్టు విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణ ఆగస్టు 16వ తేదీకి వాయిదా వేసింది.

బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్‌లో భూములు కేటాయించడంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. అత్యంత విలువైన భూములు ఎలా కేటాయిస్తారని పిటిషనర్ పిల్ వేశారు. ఎకరానికి రూ.50 కోట్ల విలువైన భూమిని రూ.3.41 కోట్లకే కేటాయించారని, భూ కేటాయింపు డాక్యుమెంట్లు అన్నీ రహస్యంగా పెట్టారని పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.

కాగా హైదరాబాద్‌లో ఇప్పటికే పార్టీ కార్యాలయం ఉన్నప్పటికీ 11 ఎకరాల భూములను మళ్లీ కేటాయించడం అక్రమమంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. గండిపేట మండలం, కోకాపేట గ్రామంలో 239, 240 సర్వే నెంబర్‌లో ఎకరా రూ. 50 కోట్లు విలువ చేసే.. 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వం కేటాయించింది. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోంది.

Updated Date - 2023-07-18T14:14:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising