ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jitta Balakrishna Reddy: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై జిట్టా బాలకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-07-29T13:24:54+05:30

కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్‌ రెడ్డిపై తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

హైదరాబాద్: కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్‌ రెడ్డిపై (Telangana BJP Chief Kishan Reddy) తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి (Jitta Balakrishna Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డిని సమైక్యవాదిగా అభివర్ణించారు. శనివారం జిట్టా మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ (CM KCR) ఆదేశాలతోనే కిషన్ రెడ్డి తనను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. పార్టీలో మరో నాయకుడు ఎదగొద్దనేది కిషన్ రెడ్డి ఆలోచన అన్నారు. ఎన్నికల తర్వాత ఇతర పార్టీలను చీల్చి తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్ చేస్తోందన్నారు. బీఆర్ఎస్‌తో లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కిషన్ రెడ్డికి బీజేపీ అధ్యక్ష పదవి అంటూ వ్యాఖ్యలు చేశారు. భద్రాచలం రాముడి గుడిని అభివృద్ధికి చేయలేని సిగ్గు శరం లేని మంత్రి కిషన్ రెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు. కుట్రలో భాగంగానే బీజేపీని బలోపేతం చేసిన బండి సంజయ్‌ను అధ్యక్ష బాధ్యత నుంచి తప్పించారని ఆయన ఆరోపించారు.

మీడియాకు లీకులిచ్చి.. స్వయంగా ఈటల రాజేందర్ (Etela Rajender Reddy) బీజేపీని బలహీనపరిచారన్నారు. అమిత్ షా (Amit Shah), జేపీ నడ్డాలను (JP Nadda) తిట్టిన రఘునందనరావును (MLA Raghunandan rao) కిషన్ రెడ్డి సంకలో పెట్టుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. తనను సస్పెండ్ చేసేకంటే ముందు రఘునందనరావు, ఈటల, ఏ.చంద్రశేఖర్, రవీందర్ నాయక్‌లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ విషయంలో మోదీ, అమిత్ షాలు కల్లబొల్లి మాటలు చెప్పున్నారన్నారు. కేసీఆర్‌తో ఒప్పందంలో భాగంగానే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని మునుగోడులో బలిపశువును చేశారన్నారు. లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కవిత లిక్కర్ స్కాం కేసు నిర్వీర్యం చేశారన్నారు. బీజేపీని హైదరాబాద్‌కే పరిమితం చేసిన ఘనత కిషన్ రెడ్డిదే అని అన్నారు. హిందుత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ రాజసింగ్‌పై సస్పెన్షన్ ఎందుకు ఎత్తివేయటం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్‌ను కేసీఆర్ అరెస్ట్ చేయిస్తారనే భయం బీజేపీకి పట్టుకుందని జిట్టా బాలకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-07-29T13:24:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising