Kishan Reddy: రాజకీయాలకు అతీతంగా ‘‘మేరీ మాటీ - మేరా దేశ్’’

ABN , First Publish Date - 2023-09-04T16:57:03+05:30 IST

శవ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం ‘‘మేరీ మాటీ - మేరా దేశ్:’’ కార్యక్రమం కొనసాగిస్తుందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి(Kishan Reddy) పేర్కొన్నారు.

Kishan Reddy:  రాజకీయాలకు అతీతంగా ‘‘మేరీ మాటీ - మేరా దేశ్’’

హైదరాబాద్: దేశవ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం ‘‘మేరీ మాటీ - మేరా దేశ్:’’ కార్యక్రమం కొనసాగిస్తుందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి(Kishan Reddy) పేర్కొన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 75 సంవత్సరాల ‘‘ఆజాద్ కీ అమృత్ మహోత్సవం’’(Azad Ki Amrit Mahatsavam) సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM MODI) చేపట్టారన్నారు. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ఈ మట్టి సేకరణ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. స్వాతంత్రం కోసం పోరాడిన మహా నేతల ఇళ్లకు వెళ్లి మట్టిని సేకరించాలన్నారు. అక్టోబర్ 31వ తేదీన సర్దార్ వల్లభాభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ముగుస్తుందని చెప్పారు. కర్తవ్యపథ్‌లో ప్రధాని మోదీ స్వయంగా ఈ కళాశాలను స్వీకరిస్తారని తెలిపారు. ఈ మట్టితోనే ఢిల్లీలో అమరవీరుల స్మారక స్థూపాన్నినిర్మిస్తున్నామన్నారు. తెలంగాణలో రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామం కావాలని కిషన్‌రెడ్డి పిలుపు నిచ్చారు.

Updated Date - 2023-09-04T16:57:03+05:30 IST