ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kishan Reddy: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహిస్తాం

ABN, First Publish Date - 2023-09-05T13:59:49+05:30

తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17ను గత సంవత్సరం మాదిరిగానే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సారి కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అధికారికంగా నిర్వహిస్తామన్నారు.

హైదరాబాద్ : తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17ను గత సంవత్సరం మాదిరిగానే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సారి కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అధికారికంగా నిర్వహిస్తామన్నారు. అతిథులుగా ఎవరు వస్తారన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలవగా ముందు కేసీఆర్ అధికారకంగా నిర్వహిస్తామన్నారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తరువాత.. అధికారంలోకి వచ్చి ఇప్పుడు మాట తప్పారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

మజ్లిస్ పార్టీకి ఒవైసీ ఒత్తిడి తలొగ్గి విమోచన కార్యక్రమాలు చేయడం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. ఒవైసీ కేసీఆర్ భయపడి కార్యక్రమాలు చేయడం లేదన్నారు. ఆనాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ గడ్డపైనా జెండా ఎగురవేశారన్నారు. ఇప్పుడు 70 ఏళ్ల తరువాత మళ్లీ అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ అయిన అమిత్ షా జెండా ఎగుర వేశారన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అమృత్ మహోత్సవాలు చేశామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-09-05T13:59:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising