ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kishan reddy: 80 వేలకు పైగా పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు ఈవిషయం తెలియదా..?

ABN, First Publish Date - 2023-09-16T17:56:05+05:30

తెలంగాణ విమోచన దినోత్సవం(Telangana Liberation Day) రోజున సీడబ్ల్యూసీ సమావేశాన్ని(CWC meeting) ఎందుకు ఏర్పాటు చేశారని కాంగ్రెస్(Congress) నేతలను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy)ప్రశ్నించారు.

హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవం(Telangana Liberation Day) రోజున సీడబ్ల్యూసీ సమావేశాన్ని(CWC meeting) ఎందుకు ఏర్పాటు చేశారని కాంగ్రెస్(Congress) నేతలను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy)ప్రశ్నించారు. శనివారం నాడు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్రం ఆధ్వర్యంలో రేపు జరగనున్న..విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Amit Shah) హాజరుకానున్నారు. రాత్రికే బీజేపీ అగ్రనేత అమిత్‌షా హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ చరిత్రను ప్రజలకు తెలియకుండా చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమా..?భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద కాంగ్రెస్ నాయకులందరూ రక్తం కారే విధంగా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

విమోచన దినోత్సవం జాతీయ సమైక్యత దినోత్సవం ఎలా అవుతుందో తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) చెప్పాలి. జాతీయ సమైక్యత దినోత్సవం అని పేరు ఎలా పెడుతారు. 80 వేలకు పైగా పుస్తకాలు చదివిన కేసీఆర్ జాతీయ సమైక్యత దినోత్సవం పైన బహిరంగ చర్చకు రావాలని కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు.కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ కార్యక్రమంగా పోలీసులు చిత్రీకరించడాన్ని తీవ్రంగా ఖండించారు.బీజేపీ కార్యక్రమం అంటూ సర్య్కూలర్ విడుదల చేసిన పోలీస్ అధికారుల పైన కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తుంది’’ అని కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-16T17:56:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising