ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కిషన్ రెడ్డి
ABN, First Publish Date - 2023-08-17T12:15:06+05:30
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ఎన్నికలపై మరింత ఫోకస్ పెట్టారు. బీజేపీ రాష్ట్ర కమిటీలో చేర్పులపై కిషన్ రెడ్డి కసరత్తు నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో పాత వారిని కొనసాగిస్తూనే.. కొత్తవారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
ఖమ్మం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ఎన్నికలపై మరింత ఫోకస్ పెట్టారు. బీజేపీ రాష్ట్ర కమిటీలో చేర్పులపై కిషన్ రెడ్డి కసరత్తు నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో పాత వారిని కొనసాగిస్తూనే.. కొత్తవారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర కమిటీని కిషన్ రెడ్డి ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోనే కిషన్ రెడ్డి ఉన్నారు. ఇద్దరు ఉపాధ్యక్షులు, ఇద్దరు సెక్రటరీలు, నలుగురు అధికార ప్రతినిధులకు కొత్తగా అవకాశం లభించనుంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల కోసం 22 కమిటీలను ఏర్పాటు చేయాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. మేనిఫెస్టో కమిటి, చార్జ్ షీట్ కమిటి, మీడియా కమిటి, ఎలక్షన్ ఆఫీస్ అండ్ మేనేజ్‌మెంట్ కమిటి, బహిరంగ సభల నిర్వహణ కమిటి, జాతీయ నేతల టూర్స్ సమన్వయ కమిటి, సోషల్ మీడియా కమిటి, పబ్లిక్ సిటి కమిటి, ఎన్నికల సామాగ్రి పంపిణీ కమిటి సహా.. 22 కమిటీలను కిషన్ రెడ్డి ప్రకటించనున్నారు.
కాగా రేపు కిషన్ రెడ్డి ఖమ్మం రానున్నారు. ఈ నెల 27న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖమ్మం పర్యటన సందర్భంగా ఏర్పాట్లపై ఆయన సమీక్షించనున్నారు. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కిషన్ రెడ్డికి స్వాగతం పలికి, బైక్ ర్యాలీగా టూ టౌన్ పోలీస్ స్టేషన్ వరకూ తీసుకురావాలని బీజేపీ జిల్లా కమిటీ నిర్ణయం తీసుకుంది. రేపు మధ్యాహ్నం రెండు గంటలకు వీవీసీ ఫంక్షన్ హాల్లో కార్యకర్తలు, ముఖ్య నేతలతో కిషన్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు.
Updated Date - 2023-08-17T12:15:06+05:30 IST