ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kishan Reddy: ఆయన ఎలా మరణించారో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు

ABN, First Publish Date - 2023-09-25T13:08:22+05:30

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీన్ దయాల్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన ఫోటోకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు రాష్ట్ర కార్యాలయంలో మొక్కలు నాటారు.

హైదరాబాద్: బీజేపీ (BJP) రాష్ట్ర కార్యాలయంలో దీన్ దయాల్ జయంతి వేడుకలు (Deen Dayal Jayanti Celebrations) ఘనంగా జరిగాయి. ఆయన ఫోటోకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు రాష్ట్ర కార్యాలయంలో మొక్కలు నాటారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దేశ సమగ్రత కోసం ప్రారంభించిన పార్టీ బీజేపీ అని, పార్టీ ఏర్పడక ముందు భారతీయ జన సంఘ్‌గా ఉండేదని, దీన్ని శ్యామ ప్రసాద్ ముఖర్జీ (Shyam Prasad Mukherjee) ఏర్పాటు చేశారని చెప్పారు. ఆపై దీన్ దయాల్ జన సంఘ్‌ను బీజేపీ‌గా మార్చారని, పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. కొన్ని రాజకీయ పార్టీలు ఇతర పార్టీలతో కలిసి అధికారంలోకి వచ్చాయిని, కానీ దీన్ దయాల్ ఎన్నడూ తన విలువలు కోల్పోలేదన్నారు.

బ్రిటిష్ వాళ్ళు ఇచ్చి వెళ్లిన ఆర్థిక విధానాలు వద్దని దీన్ దయాల్ పలు మార్పులు చేశారని, నూతన ఆర్థిక విధానాన్ని తీసుకొచ్చారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పేదల కోసం అంత్యోదయ పథకాన్ని తీసుకొచ్చిన వ్యక్తి దీన్ దయాల్ అని, ఆయన ఎలా మరణించారో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదని, ఆయన మరణం ఇంకా మిస్టరీగానే ఉందన్నారు. రైల్ ట్రాక్‌పై మృత దేహం పడి ఉందని తెలిపారు. మోదీ ప్రభుత్వం ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తోందని, అవినీతి, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ బీజేపీ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-09-25T13:08:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising