Harishrao: ఆదివాసీ, గిరిజనులకు మంత్రి హరీష్‌రావు శుభాకాంక్షలు
ABN , First Publish Date - 2023-08-09T10:33:21+05:30 IST
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ, గిరిజనులకు మంత్రి హరీష్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు.
హైదరాబాద్: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం (World Adivasi Day) సందర్భంగా ఆదివాసీ, గిరిజనులకు మంత్రి హరీష్‌రావు (Minister Harish Rao) శుభాకాంక్షలు తెలియజేశారు. జల్.. జంగల్.. జమీన్ కొమురం భీము నినాదాన్ని నిజం చేసింది కేసీఆర్ అని అన్నారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... ‘‘విధ్వంసపు దారుల నుంచి వికసిత తోవలు, మోడువారిన బతుకుల్లో మోదుగు పూల పరిమళాలు, మావ నాటే మావ రాజ్.. మా తాండాలో మా రాజ్యం అనే ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షలను నెరవేర్చింది కేసీఆర్ గారు. జల్..జంగల్.. జమీన్ కొమురం భీము నినాదాన్ని నిజం చేసింది కేసీఆర్ గారు. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా ఆదివాసీ, గిరిజనులకు శుభాకాంక్షలు’’ అంటూ మంత్రి హరీష్‌రావు ట్వీట్ చేశారు.