Talasani Srinivasyadav: కిషన్ రెడ్డి... ఎందుకీ రాజకీయ డ్రామా
ABN , First Publish Date - 2023-07-20T15:07:26+05:30 IST
ఛలో బాటసింగారంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించేందుకు బీజేపీ నేతలు యత్నించడంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
హైదరాబాద్: ఛలో బాటసింగారంలో డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించేందుకు బీజేపీ నేతలు యత్నించడంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదని మంత్రి వ్యాఖ్యలు చేశారు. తాము కట్టిన ఇళ్ల దగ్గర బీజేపీ నేతల తాపత్రయం ఎందుకని ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) ఉదయం నుంచి డ్రామా చేస్తున్నారన్నారు. డబుల్ బెడ్ రూమ్ ప్రారంబాలకు కిషన్ రెడ్డి, తాను కలిసి వెళ్ళామని గుర్తుచేశారు. కిషన్ రెడ్డి చాలా సార్లు డబల్ బెడ్ రూం ఇళ్లు బాగా ఉన్నాయి అని అన్నారన్నారు. బాట సింగారంలో కట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లు ఉన్నాయని తెలిపారు. బీజేపీ ఎక్కడైన రాష్ట్రాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిందా అని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా అధికారికంగా వెళ్లి డబుల్ బెడ్ రూంలు చూడవచ్చన్నారు. కిషన్ రెడ్డి... ఎందుకీ రాజకీయ డ్రామా అంటూ ప్రశ్నించారు. వస్తా అంటే కిషన్ రెడ్డిని కొల్లూరు తీసుకుని పోయి చూపిస్తా అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క ఇంటికి కేవలం లక్ష యాబై వేల రూపాయలు మాత్రమే ఇస్తుందని తెలిపారు. గ్రేటర్‌లో డబుల్ బెడ్ రూంలను మూడు ఫేస్‌లలో పంపిణీ చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.