Manik Rao Thackeray: అసెంబ్లీ అభ్యర్థులపై త్వరలోనే తుది నిర్ణయం
ABN , First Publish Date - 2023-09-23T21:50:27+05:30 IST
తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ(Telangana Congress Assembly) అభ్యర్థులకు సంబంధించి ఈరోజు స్క్రీనింగ్ కమిటీ(Screening Committee) సమావేశం అయింది. ఈసమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మధుయాష్కి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంతమంది కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ(Telangana Congress Assembly) అభ్యర్థులకు సంబంధించి ఈరోజు స్క్రీనింగ్ కమిటీ(Screening Committee) సమావేశం అయింది. ఈసమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మధుయాష్కి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంతమంది కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రెండు విడతల్లో కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలోనే అభ్యర్థుల లిస్ట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా మాణిక్‌రావు ఠాక్రే(Manik Rao Thackeray) మాట్లాడుతూ.. ‘‘ త్వరలోనే 50% పైగా అభ్యర్థులను మొదటి విడతలో ప్రకటిస్తాం. అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుంది. పార్టీలో చేరే నేతలను ఎవరు అడ్డుకోవడం లేదు.. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలు అందరినీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. రాహుల్‌గాంధీ అదే చెప్పారు నేతలందరినీ కలుపుకొని ముందుకెళ్లమన్నారు. గాంధీభవన్ వేదికగా చేరికలు ఉంటాయి. ముఖ్య నేతలు ఢిల్లీ వచ్చి సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలుస్తారు. తెలంగాణలో అందరితో పాటు కలిసి ముందుకెళ్లేందుకు సిద్ధమయ్యాం. స్క్రీనింగ్ కమిటీలో అభ్యర్థుల ఎంపిక చేసిన తర్వాత నేరుగా కేంద్ర ఎన్నికల కమిటీకి ఎంపిక చేసిన లిస్ట్ వెళ్తుంది. అనంతరం తుది అభ్యర్థుల లిస్ట్ విడుదల ఉంటుంది. తెలంగాణలో ప్రతిరోజూ చేరికలు ఉంటున్నాయి’’ అని మాణిక్‌రావు ఠాక్రే పేర్కొన్నారు.