ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Politics: కార్యకర్తలకు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సీరియస్ వార్నింగ్

ABN, First Publish Date - 2023-07-15T15:47:29+05:30

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ రూల్స్‌ను అతిక్రమించే కార్యకర్తలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గాంధీ భవన్ మెట్లపై ధర్నా చేస్తున్న కార్యకర్తలపై అధ్యక్షుడు మండిపడ్డారు. గాంధీ భవన్ మెట్లపై ఇక ధర్నాలు చేస్తే సస్పెండ్‌ చేస్తామని రేవంత్‌ హెచ్చరించారు. గాంధీ భవన్ మెట్లపై ధర్నా చేసే వారి వివరాలు సేకరించాలని నాయకులకు రేవంత్ ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (PCC chief Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ రూల్స్‌ను అతిక్రమించే కార్యకర్తలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గాంధీ భవన్ మెట్లపై ధర్నా చేస్తున్న కార్యకర్తలపై అధ్యక్షుడు మండిపడ్డారు. గాంధీ భవన్ మెట్లపై ఇక ధర్నాలు చేస్తే సస్పెండ్‌ చేస్తామని రేవంత్‌ హెచ్చరించారు. గాంధీ భవన్ మెట్లపై ధర్నా చేసే వారి వివరాలు సేకరించాలని నాయకులకు రేవంత్ ఆదేశించారు.

కార్యకర్తలకు సమస్య ఉంటే వినతి పత్రం ఇవ్వాలన్నారు. అంతేకాని పార్టీ ఆఫీసులో ధర్నాలు చేస్తే మాత్రం పార్టీ వ్యతిరేక చర్యగా చూస్తామని రేవంత్ పేర్కొన్నారు. పార్టీ లైన్ దాటితే సస్పెండ్ చేయాలని సంబంధిత నాయకులకు రేవంత్ ఆదేశించారు. మండల కమిటీలో చోటు దక్కని వారు వరుసగా ధర్నాలు చేస్తున్న నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.

పార్టీ పదవుల్లో తమకు అన్యాయం జరుగుతోందంటూ కొందరు నాయకులు గాంధీభవన్‌లో ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. శనివారం కూడా గాంధీ భవన్‌కు రేవంత్‌ వచ్చేసరికి ఆలేరు నియోజకవర్గం తురకపల్లికి చెందిన కొందరు ఆందోళన చేస్తూ కనిపించారు. వారి వివరాలు తెలుసుకున్న తర్వాత ఆందోళనలపై రేవంత్‌ తీవ్రంగా స్పందించారు. ఆలేరు నియోజకవర్గంలో 8 మండలాలకు 7 మండలాల అధ్యక్షులను నియోజకవర్గ ఇంఛార్జి బీర్ల ఐలయ్య, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి అనుకూలంగా ఉన్నవారినే నియమించామని రేవంత్ గుర్తుచేశారు. ఒక్క మండలం మహిళకు ఇవ్వడాన్ని వ్యతిరేకించడం ఏంటని ప్రశ్నించారు. తక్షణమే ఆందోళన విరమించకుంటే సస్పెండ్ చేసేందుకు వివరాలు సేకరించాలని నేతలకు రేవంత్ ఆదేశించారు.

Updated Date - 2023-07-15T15:49:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising