Revanth Reddy: విశ్వనగరం మత్తు పదార్థాలకు అడ్డాగా మారింది

ABN , First Publish Date - 2023-08-22T14:38:37+05:30 IST

విశ్వనగరం చేశానని కేసీఆర్ గప్పాలు కొట్టే మన హైదరాబాద్... బీఆర్ఎస్ పాలనలో గంజాయికి, మత్తు పదార్థాలకు అడ్డాగా మారింది. నిన్న సింగరేణి కాలనీలో, నేడు మీర్‌పేటలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలు కలచివేస్తున్నాయి. పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుని ప్రజల మానప్రాణాలను గాలికి వదిలేశారు.

Revanth Reddy: విశ్వనగరం మత్తు పదార్థాలకు అడ్డాగా మారింది

హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వంపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. ఏం ట్వీట్ చేశారంటే.. ‘‘విశ్వనగరం చేశానని కేసీఆర్ గప్పాలు కొట్టే మన హైదరాబాద్... బీఆర్ఎస్ పాలనలో గంజాయికి, మత్తు పదార్థాలకు అడ్డాగా మారింది. నిన్న సింగరేణి కాలనీలో, నేడు మీర్‌పేటలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలు కలచివేస్తున్నాయి. పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుని ప్రజల మానప్రాణాలను గాలికి వదిలేశారు. ఇలాంటి పాలనపై “తిరగబడదాం - తరిమికొడదాం”. అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.

మీర్‌పేటలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. కొందరు యువకులు ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్లి బాలికను ఎత్తుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు ఆందోళనలు చేపట్టారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2023-08-22T14:39:39+05:30 IST