Avinash In Viveka Case : ఇంత జరుగుతున్నా కేసీఆర్ సర్కార్ సైలెంట్‌గా ఉందేం..? : ఎడిటర్ శ్రీనివాస్
ABN , First Publish Date - 2023-05-19T12:38:47+05:30 IST
హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించిన అంశంలో ఎంపీ అవినాష్ రెడ్డి శుక్రవారం ఉదయం విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది.
హైదరాబాద్: వివేకా హత్య కేసు (Viveka Murder Case)కు సంబంధించిన అంశంలో ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) శుక్రవారం ఉదయం విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులు (CBI Notices) ఇచ్చింది. ఈ క్రమంలో మీడియా మొత్తం కూడా లైవ్ కవరేజ్ (Live Coverage) ఇస్తోంది. ఆ ప్రక్రియలోనే ఏబీఎన్ ఆంద్రజ్యోతి (ABN Andhrajyothy) సీబీఐ కార్యాలయం, అవినాష్ ఇంటి వద్ద లైవ్ అప్ డేట్ (Live update) ఇచ్చేందుకు వచ్చింది. ఈ క్రమంలో అవినాష్ పులివెందుల రౌడీలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులకు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తూ.. బెదిరింపులు దిగడమే కాకుండా ప్రత్యక్ష దాడులకు పాల్పడ్డారు. అవినాష్ కాన్వాయ్‌ను అనుసరించవద్దని, వీడియోలు తీయవద్దని అడ్డుకుని వాహనాన్ని ధ్వంసం చేసి, ఏబీఎన్ ప్రతినిధులపై దాడులు చేశారు. కెమెరాలు తీసుకుపోయారు. ఈ ఘటనను ప్రజాస్వామ్య వాదులంతా ఖండిస్తున్నారు.
ఎందుకీ మౌనం..?
ఈ ఘటనపై స్పందించిన ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ (Andhrajyothy Editor Srinivas) మాట్లాడుతూ వాళ్ల రాజకీయ సంస్కృతి, సహజ ధొరణి ఇలాగే ఉంటుందని, దానికి అనుగుణంగానే వ్యవహరించారన్నారు. దీన్ని మనం ప్రజాస్వామిక, పత్రిక సమాజం ఎలా ప్రతిఘటించాలని ఆలోచించాలన్నారు. ఎక్కడో ఉన్న రాజకీయ సంస్కృతిని హైదరాబాద్‌కు తీసుకువచ్చి, వీరంగం వేయడం.. కేసీఆర్ సర్కార్ చూస్తూ ఎందుకు సహిస్తోందో ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు.
మేం సక్రమంగానే ఉన్నాం..!
వివేకా ఏపీ రాజకీయ చరిత్రలో కీలకమైన వ్యక్తి అని, వివేకా హత్య కేసులో వాస్తవాలు బయటకు రావాలని శ్రీనివాస్ అన్నారు. వివేకా కేసులో న్యాయమైన కోణాన్ని.. బయటకు తీయాలని మీడియా వ్యవహరిస్తోందని, వాస్తవాలను వెలుగులోకి తెచ్చేలా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రయత్నిస్తోందన్నారు. మీడియా తీరుపై అభ్యంతరాలు ఉంటే చెప్పవచ్చునని.. ఇలా దాడులు చేయడం సరికాదన్నారు. కేసు విచారణకు సంబంధించిన సమచార సేకరణలో... ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తీరు సక్రమంగానే ఉందన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఏమి చెబుతుందనేది ప్రజలు తెలుసుకోవాలనుకుంటారని.. ప్రాథమిక హక్కులకు ఆటంకం కలిగించడం సరికాదన్నారు. భౌతిక దాడులకు పాల్పడటం హేయమైన చర్య అని, దాడులకు పాల్పడిన వారిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఎడిటర్ శ్రీనివాస్ కోరారు.
భయపడొద్దు..!
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సిబ్బంది సరైన తీరులోనే పనిచేశారని ఎడిటర్ శ్రీనివాస్ అన్నారు. దాడికి గురైన ఏబీఎన్ ప్రతినిధి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఏ మాత్రం వెనుకంజ వేయాల్సిన అవసరం లేదని, విధి నిర్వహణలో ఏబీఎన్ ప్రతినిధులు ముందుకు వెళ్లాలని శ్రీనివాస్ పేర్కొన్నారు.