Delhi: నేడు కాంగ్రెస్ పెద్దలను కలవనున్న పొంగులేటి, జూపల్లి
ABN, First Publish Date - 2023-06-26T10:20:02+05:30
న్యూఢిల్లీ: బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు సోమవారం ఢిల్లీల్లో కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు. ఈ సాయంత్రం 3గంటలకు ఇరువురు నేతలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని మర్యాద పూర్వకంగా కలవనున్నారు.
న్యూఢిల్లీ: బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy), జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) సోమవారం ఢిల్లీల్లో కాంగ్రెస్ (Congress) పెద్దలను కలవనున్నారు. ఈ సాయంత్రం 3గంటలకు ఇరువురు నేతలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని మర్యాద పూర్వకంగా కలవనున్నారు. అంతకు ముందు పలువురు సీనియర్ నేతలను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పొంగులేటి, జూపల్లితో పాటు కాంగ్రెస్ పెద్దలను వారి ముఖ్య అనుచరులు కలవనున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పలువురు సీనియర్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలతో పాటు.. జానారెడ్డి, షబ్బీర్ అలీ, రేణుకా చౌదరి సహా 12 మంది సీనియర్ నేతలతో పార్టీ పెద్దలు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిణామాలు, రాజకీయ పరిస్థితులు, పార్టీ పురోగతి వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలియవచ్చింది.
కాగా కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో కలిసి ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం ఉదయం ఆయన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డితో కలిసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీలను కలుసుకోనున్నారు. వీరితోపాటు మరో 40 మంది అనుచరులు కూడా వారిని కలవనున్నారు. సాయంత్రం 3 గంటలకు రాహుల్‌తో జరిగే ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, మహేశ్‌కుమార్‌గౌడ్, హర్కార వేణుగోపాల్ తదితరులు పాల్గొననున్నారు.
కాగా పీపుల్స్ మార్చ్ పేరుతో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క చేపట్టిన పాదయాత్ర ఖమ్మంలో ముగియనున్న నేపథ్యంలో.. ముగింపు సభలో రాహుల్‌గాంధీ పాల్గొననున్నారు. ఈ సభను జూలై 2, 3 తేదీల్లో ఏ రోజు నిర్వహించాలన్నది ఈ భేటీలో ఖరారు కానుంది. తాను ఖమ్మంలో నిర్వహించనున్న సభలో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో ఆ పార్టీలో చేరతానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తనతోపాటు ముఖ్యమైన నేతలు, తన అనుచరులంతా చేరతారని చెప్పారు. ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న సందర్భంగా విమానాశ్రయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది తెలంగాణ బిడ్డలు కోరుకున్న ప్రభుత్వం కాదన్నారు. బీఆర్‌ఎస్ సర్కారును కలిసికట్టుగా గద్దె దింపుతామని ప్రకటించారు. ఖర్గే, రాహుల్‌లతో భేటీ అనతరం భవిష్యత్తు కార్యాచరణను విలేకరుల సమావేశంలో వెల్లడిస్తానని చెప్పారు. తన నిర్ణయం వెనుకున్న కారణాలనూ వివరిస్తానన్నారు.
Updated Date - 2023-06-26T10:20:02+05:30 IST