ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy : అందుకే కమ్యూనిస్టులను కేసీఆర్ వదిలేశారు

ABN, First Publish Date - 2023-08-23T18:12:50+05:30

బీజేపీ(BJP)తో ఉన్న అనుబంధంతోనే కమ్యూనిస్టుల (Communists)ను కేసీఆర్ వదిలేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి(TPCC Chief Revanth Reddy) అన్నారు. బుధవారం నాడు గాంధీభవన్‌లో మాజీమంత్రి ఎ. చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

హైదరాబాద్: బీజేపీ(BJP)తో ఉన్న అనుబంధంతోనే కమ్యూనిస్టుల (Communists)ను కేసీఆర్ వదిలేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి(TPCC Chief Revanth Reddy) అన్నారు. బుధవారం నాడు గాంధీభవన్‌లో మాజీమంత్రి ఎ. చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ నుంచి జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన హుగ్గెల్లి రాములు, పలువురు కార్యకర్తలు కాంగ్రెస్‌(Congress) తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎ. చంద్రశేఖర్ తెలంగాణ(Telangana) సాధనలో కీలక పాత్ర పోషించారు. వారిని కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం. మునుగోడులో కమ్యూనిస్టులతో కలిసిన కేసీఆర్... కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో బీజేపీకి, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా పోటీ చేస్తామని ప్రకటించారు. కానీ, ఢిల్లీ వెళ్లి మోదీని కలిసిన కేసీఆర్.. అమిత్‌షా(Amit Shah)తో చీకట్లో ఒప్పందం చేసుకొని.. రాష్ట్రంలో కమ్యూనిస్టులకు పంగనామాలు పెట్టాడు.కమ్యూనిస్టులకు సీట్లు ఇవ్వకుండా, ఏకపక్షంగా కేసీఆర్ ఎందుకు సీట్లు ప్రకటించారు..? బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఖాయమైంది కాబట్టే, కమ్యూనిస్టులను కేసీఆర్(KCR)కరివేపాకులా వాడుకుని వదిలేశారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ బొందలగడ్డ తెలంగాణగా మారింది. 60 వేల బెల్టు షాపులు దేశంలో ఏ రాష్ట్రంలో లేవు. వైన్ షాపుల టెండర్ల పేరుతో 2500 కోట్లు కేసీఆర్ కొల్లగొట్టారు.కాంగ్రెస్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తే... కేసీఆర్ 7500 కోట్లకు తెగమ్ముకున్నారు.సాగునీటి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్. కాంగ్రెస్ ఏం చేసిందో..నాగార్జున సాగర్ కట్టమీద చర్చిద్దామా?. చరిత్ర తిరగేసి చూడు కాంగ్రెస్ ఏం చేసిందో తెలుస్తుంది’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

కాళేశ్వరం(Kaleswaram)లో కేసీఆర్ లక్ష కోట్లు దిగమింగాడని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు.‘‘కామారెడ్డిలో 22వ ప్యాకేజీ పనులు పూర్తి కాలేదు. కామారెడ్డికి గోదావరి నీళ్లు తెస్తేనే.. కేసీఆర్ కామారెడ్డిలో అడుగుపెట్టాలి. కాంగ్రెస్ హయాంలో పదేళ్లలో 25లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించాం. కేసీఆర్‌కు సూటిగా సవాల్ విసురుతున్న ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన చోట మీరు ఓట్లు అడగొద్దు...డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చిన చోట మేం ఓట్లు అడగం. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని కేసీఆర్ తుంగలో తొక్కారు.బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలను ఓడించండి. కాంగ్రెస్‌ను గెలిపించండి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం. 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం.రూ.5లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు సాయం అందిస్తాం.26న చేవెళ్లలో జరిగే సభను విజయవంతం చేయాలి’’ అని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Updated Date - 2023-08-23T18:12:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising