ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy: ప్రజల హక్కులను కాలరాసిన కేసీఆర్

ABN, First Publish Date - 2023-08-12T21:10:46+05:30

విద్యార్థి, ఉద్యమకారుల ఆత్మబలిదానాలు గౌరవించి సోనియాగాంధీ(Sonia Gandhi) తెలంగాణ ఇచ్చారని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి(Revanth Reddy) అన్నారు.

హైదరాబాద్(Hyderabad): విద్యార్థి, ఉద్యమకారుల ఆత్మబలిదానాలు గౌరవించి సోనియాగాంధీ(Sonia Gandhi) తెలంగాణ ఇచ్చారని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి(Revanth Reddy) అన్నారు. శనివారం నాడు బోయినపెల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్లో కాంగ్రెస్ ప్రజాకోర్టు సభ నిర్వహించింది. ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ..‘‘రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనాలకు విలువ ఇచ్చి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది.ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని కేసీఆర్ చెప్పిండు.తొమ్మిదేళ్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రజల హక్కులను కాలరాశాడు. రాజులను, నియంతలను మరిపించేలా ప్రజలపై కేసీఆర్ దాడులు చేస్తున్నారు.కేసీఆర్‌ను శిక్షించేందుకే ఇక్కడ ప్రజాకోర్టులో ప్రజా ఛార్జ్‌షీట్లు పెడుతున్నాం. ఈ ప్రజాకోర్టులో ప్రొఫెసర్ కంచె ఐలయ్య తీర్పు చెబుతారు.సామాజిక న్యాయం తెలంగాణలో భూతద్దం పెట్టి చూసినా కనిపించడం లేదు.అందుకోసమే ఈ ప్రజా కోర్టును ఏర్పాటు చేశాం.గ్రామ గ్రామాన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ‘‘తిరగబడదాం, తరిమికొడదాం’’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి’’ అని శ్రేణులకు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.


కేసీఆర్ ది కౌరవ సైన్యం: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

14 శాఖలు కేసీఆర్ కుటుంబం చేతిలోనే ఉన్నాయని.. కేసీఆర్ ది కౌరవ సైన్యమని కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivas Reddy) అన్నారు.‘‘పింక్ షర్ట్ తొడుక్కున్న వ్యక్తిని కాకుండా వేరే వాళ్లని కేసీఆర్ వేధిస్తున్నారు.ప్రభుత్వ వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.సెక్రటేరియట్‌కి వెళ్లాలంటే సీఎం కేసీఆర్‌కి ప్రాణగండం, పదవిగండం ఉందని కొత్తది కట్టారు. బోనులో ఉన్న నలుగురు బీఆర్ఎస్ నేతల వల్ల తెలంగాణ(Telangana) ఆగం అయింది. ఆంధ్ర క్యాడర్ సోమేష్ కుమార్‌కి పదవులు ఇచ్చి ఆయనతో దోపిడీ చేయిస్తున్నాడు. 15 సంవత్సరాల క్రితం రిటైర్డ్ అయిన వాళ్లకి కూడా ప్రాధానం ఉన్న పదవులు ఇస్తున్నారు. వారి బండారం బయటపడుతుందని ఐదు సంవత్సరాల్లో కేవలం 70 రోజులు మాత్రమే అసెంబ్లీ నడిపారు.దక్షిణ తెలంగాణలో తక్కువ రోజులు అసెంబ్లీ నడిపింది తెలంగాణ ప్రభుత్వమే. సమాచారం ఇవ్వాల్సి వస్తుందనే భయంతో సమాచార కమిషన్‌లో అధికారులను నియమించడం లేదు. బోనులో ఉన్న ఆ నలుగురుకి యావజ్జీవ శిక్ష వేస్తారా? ఉరిశిక్ష వేస్తారా?. కల్వకుంట్ల కుటుంబంలోని నలుగురు మంత్రులు కూడా సరిగా పని చేయడం లేదు’’ అని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు.


బీసీలు చాలా నష్టపోయారు: మహేష్ కుమార్ గౌడ్

ఓట్ల కోసం ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను కేసీఆర్ మోసం చేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) అన్నారు.‘‘బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారు. స్థానిక సంస్థలల్లో బీసీలు చాలా నష్టపోయారు.బీసీ కార్పొరేషన్‌లో వేల రుణ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు లక్ష ఆర్థిక సహాయంతో మరోసారి బీసీలను మోసం చేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు.డీడీలు కట్టిన గొర్ల కాపర్లకు గొర్రెలు రావడం లేదు. రాష్ట్ర జనాభాలో 56 శాతం ఉన్న బీసీల్లో క్యాబినెట్‌లో కేవలం ముగ్గురు మంత్రులే ఉన్నారు’’ అని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు.

అవినీతిలో పోటీ పడుతున్న మోదీ, కేసీఆర్: వంశీచంద్‌రెడ్డి

మోదీ కేంద్ర సంస్థలను అమ్మేస్తే , కేసీఆర్ భూములను అమ్మేస్తున్నారని ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్‌రెడ్డి(Vamsichand Reddy) అన్నారు.‘‘అవినీతిలో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పోటీ పడుతున్నారు. అవినీతి చేయడంలో కేసీఆర్ ఇంట్లో.. కేటీఆర్, కవిత, హరీష్, సంతోష్ పోటీ పడుతున్నారు.సాగునీటి ప్రాజెక్టులను కమీషన్ ప్రాజెక్టులుగా మార్చారు. ఓర్ఆర్ఆర్‌ను 30 సంవత్సరాలు ప్రైవేట్‌కి లీజుకి ఇచ్చి భారీ అవినీతికి తెరలేపారు.దళితబంధులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 3 లక్షల రూపాయలు కమీషన్ తీసుకుంటుంన్నారు’’ అని వంశీచంద్‌రెడ్డి దుయ్యబట్టారు.

Updated Date - 2023-08-12T21:18:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising