ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy: వచ్చే ఎన్నికల్లో వారే కీలకం

ABN, First Publish Date - 2023-09-09T18:39:40+05:30

కాంగ్రెస్‌(Congress)ను ఎదుర్కొనేందుకు బీజేపీ, బీఆర్ఎస్(BJP BRS) కలిసి కుట్రలు చేసున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు.

హైదరాబాద్: కాంగ్రెస్‌(Congress)ను ఎదుర్కొనేందుకు బీజేపీ, బీఆర్ఎస్(BJP BRS) కలిసి కుట్రలు చేసున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. శనివారం నాడు ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘‘2023-24 ఎన్నికల్లో ఈ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలి. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలంటే క్షేత్ర స్థాయిలో బూత్ లెవల్ ఏజెంట్ నియామకం జరగాలి. ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించేది బూత్ లెవెల్ ఏజెంట్.కాంగ్రెస్ జెండాను మోసే నిఖార్సైన కార్యకర్తలను బూత్ లెవెల్ ఏజెంట్లుగా నియమించుకుందాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 43 లక్షల డిజిటల్ మెంబర్షిప్ చేసుకున్నాం.90లక్షల ఓట్లు తెచ్చుకుంటే రాష్ట్రంలో 90 సీట్లు గెలుస్తాం.వంద రోజులు కాంగ్రెస్ పార్టీ కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేటాయించాలి.

అయ్యప్ప, శివ మాలధారణలా కాంగ్రెస్ దీక్ష తీసుకుని, సోనియమ్మ మాల వేసుకుని కష్టపడాలి. కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారు.రజాకర్లు కూడా ఇంత దోపిడీ, విధ్వంసానికి పాల్పడలేదు. తెలంగాణలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగడం ఈ గడ్డకు దక్కిన గౌరవం. ఇక్కడ సమావేశాలు జరగడం పీసీసీ అధ్యక్షుడిగా నా జన్మ ధన్యం. వక్ఫ్ భూమిలో నాంపల్లి విజయ నగర్ కాలనీలో ఎంఐఎంకు అనుమతి ఇచ్చారు. మరి తుక్కుగూడలో కాంగ్రెస్ సభకు ఎందుకు ఇవ్వరు?.దేవుడి భూమి అనే సాకుతో అనుమతి నిరాకరించినా ఆ దేవుడే మనకు దారి చూపారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విజయభేరీ సభ కోసం వంద ఎకరాలు ఇచ్చారు.ధర్మమే కాంగ్రెస్’ను గెలిపిస్తుంది. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే’’ వస్తోందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-09-09T18:39:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising