ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy: కేసీఆర్.. వారిని బెదిరించి కాంగ్రెస్‌కు అన్యాయం చేశారు: రేవంత్‌రెడ్డి

ABN, First Publish Date - 2023-09-09T19:30:31+05:30

సీడబ్ల్యూసీ సమావేశాలకు(CWC meetings) మేం ఒక హోటల్ మాట్లాడుకుంటే... సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ (CM KCR, Minister KTR) ఆ హోటల్ వాళ్లను బెదిరించి కాంగ్రెస్‌కు(Congress) ఇవ్వొద్దని చెప్పారు... ఇవేం చిల్లర రాజకీయాలు... తెలంగాణ(Telangana) సమాజం అంతా గమనిస్తోందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) అన్నారు.

హైదరాబాద్: సీడబ్ల్యూసీ సమావేశాలకు(CWC meetings) మేం ఒక హోటల్ మాట్లాడుకుంటే... సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ (CM KCR, Minister KTR) ఆ హోటల్ వాళ్లను బెదిరించి కాంగ్రెస్‌కు(Congress) ఇవ్వొద్దని చెప్పారు... ఇవేం చిల్లర రాజకీయాలు... తెలంగాణ(Telangana) సమాజం అంతా గమనిస్తోందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) అన్నారు. శనివారం నాడు తుక్కుగూడలో మీడియాతో మాట్లాడుతూ..‘‘ సీడబ్ల్యూసీ సమావేశాలు తెలంగాణలో నిర్వహిస్తున్నందుకు సోనియాగాంధీ (Sonia Gandhi)కి, ఖర్గేకి కృతజ్ఞతలు.17వ తేదీన విజయ భేరి సభలో సోనియాగాంధీ 5 గ్యారంటీలను ప్రకటిస్తారు. సభ కోసం మొదట పరేడ్ గ్రౌండ్‌ను డిఫెన్స్ అధికారులను ఆడిగాం.కానీ బీజేపీ ప్రతిష్టను కాపాడుకునేందుకు కిషన్‌రెడ్డి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేసి పరేడ్ గ్రౌండ్‌ను కాంగ్రెస్‌కు ఇవ్వకుండా చేశారు.గచ్చిబౌలి స్టేడియంను అడిగినా స్పోర్ట్స్ అథారిటీ తిరస్కరించింది. ట్రాఫిక్ సమస్య లేకుండా తుక్కుగూడాలో ఖాళీ స్థలంలో నిర్వహించాలనుకున్నాం. కానీ దేవాదాయ శాఖ భూములు ఉన్నాయని అందులో అనుమతి నిరాకరించారు. కాంగ్రెస్ సభ జరిగితే బీఆర్ఎస్ పతనం ఖాయమని దేవుడిని అడ్డుపెట్టుకుని అనుమతి రాకుండా చేశారు. అయినా తుక్కుగూడ రైతులు ముందుకొచ్చి కాంగ్రెస్ సభకు భూములు ఇచ్చారు.

యుద్ధ ప్రాతిపదికన మా నాయకులు భూములు చదును చేసి సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఇచ్చిన నాయకురాలు సోనియా వస్తుంటే.. ప్రభుత్వం సహకరించి విజ్ఞతను ప్రదర్శించాల్సింది. దురదృష్టవశాత్తు విజ్ఞత, విజ్ఞానం కేసీఆర్‌కు లేవు. ప్రజాస్వామిక విలువలు కాపాడే ఆలోచన ఆయనకు లేదు. అధికారం ఉందని అణచివేస్తామని కేసీఆర్ అనుకుంటే... ఆ ఆటలు ఇక సాగవు. 16వ తేదీన తాజ్ కృష్ణాలో సీడబ్ల్యూసీ సమావేశం ఉంటుంది. 17వ తేదీన విజయ భేరి సభలో 5గ్యారెంటీలను సోనియాగాంధీ ప్రకటిస్తారు. ఖమ్మం సభకు ఎన్ని ఆటంకాలు కలిగించిన ఎలా విజయవంతం చేశారో... ఆ సభ స్ఫూర్తిగా ఈ విజయ భేరి సభకు లక్షలాది మంది యువకులు, రైతులు, నిరుద్యోగులు తరలిరావాలి.

తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయి. తెలంగాణను పట్టి పీడిస్తున్న బాకాసురుడు కేసీఆర్. సీడబ్ల్యూసీలో దేశ రాజకీయాలను మలుపు తిప్పే నిర్ణయాలు ఉంటాయి. మోదీపై భారత్ జోడో ప్రభావం పడినట్లుంది.. ఇండియా కూటమిని నిలువరించలేక ఇండియా పదాన్ని తొలంగించాలనుకున్నారు. అందుకే భారత్ అని పేరు మారుస్తామంటున్నారు. కానీ ఆయనకు తెలియదేమో.. ఏడాది ముందే రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర చేశారు. కిషన్‌రెడ్డి, కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ సభను అడ్డుకోలేరు’’ అని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2023-09-09T19:30:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising