Revanth Reddy: గ్యారెంటీ స్కీమ్స్‌తో సిక్స్ కొడతాం
ABN , First Publish Date - 2023-09-23T21:57:01+05:30 IST
కాంగ్రెస్ పార్టీ(Congress party)లో చేరేందుకు చాలామంది నేతలు ఉత్సాహం చూపుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) వ్యాఖ్యానించారు.
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ(Congress party)లో చేరేందుకు చాలామంది నేతలు ఉత్సాహం చూపుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) వ్యాఖ్యానించారు. శనివారం నాడు ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ ప్రజలకు మేలు జరిగే విధంగా కార్యాచరణ రూపొదిస్తాం. గ్యారెంటీ స్కీమ్స్(Guarantee Schemes)తో సిక్స్ కొడతాం. స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే ముగిసింది. నివేదికకు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదం తెలుపుతుంది. కొంతమంది టికెట్ వచ్చిందని సంతోష పడడం కొంతమంది నిరాశపడడం మంచిది కాదు. పార్టీలో అందరికీ న్యాయం జరుగుతుంది. సీసీ ఎప్పుడు నిర్వహిస్తారో తేదీ ఫైనల్ కాలేదు. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఆయా జిల్లాల స్వరూపం అక్కడ ఉన్న సామాజిక వర్గాల రిప్లనేషన్ దాన్ని బ్యాలెన్స్ వేసుకొని అభ్యర్థుల లిస్ట్ ఉంటుంది. సీఎం కేసీఆర్ ముదిరాజులు, గొల్ల కురుమలకు టికెట్లు ఇవ్వలేదు. ఒకరి మీద కోపంతో ముదిరాజులకు ఎవరికి కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తుంది. అభ్యర్థుల విషయంలో అన్నివర్గాల వారికి సముచిత ప్రాధాన్యం ఉంటుంది. సీట్లు దొరకని వారికి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సముచిత ప్రాధాన్యం కల్పిస్తుంది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీని అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. స్క్రీనింగ్ కమిటీ తనపని తాను చేస్తుంది. ఒక్కొక్క చోట ఒకటి రెండు, మూడు పేర్లు కూడా సీఈసీకి స్క్రీనింగ్ కమిటీ సిఫారసు చేసింది. అంతిమ నిర్ణయం సీఈసీ తీసుకుంటుంది. సీఈసీ ఎప్పుడు ఉంటుందనేది కాంగ్రెస్ అధ్యక్షుడు నిర్ణయిస్తారు.
కవితను ఇప్పుడు అరెస్ట్ చేసిన నష్టం ఏం లేదు
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha)ను ఇప్పుడు అరెస్ట్ చేసిన వచ్చే నష్టం ఏమీ లేదు. కేసీఆర్ తన బిడ్డ అరెస్ట్‌ను సహితం రాజకీయం కోసం ఉపయోగించుకుంటాడు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే ఒప్పందం ప్రకారం కవితను అరెస్ట్ చేసి రెండు నెలల్లో విడుదల చేస్తారు. కిషన్‌రెడ్డి వారి నేతల మధ్య ఉన్న గొడవలను మొదట సర్దుబాటు చేసుకోవాలి. ఇతర పార్టీలపై ఈడీసీఎల్‌తో బీజేపీ విచారణ చేయించింది. లక్ష కోట్ల అవినీతి చేసిన కేసీఆర్‌పై ఎందుకు ఈడీ విచారణ చేయించడం లేదు. కాంగ్రెస్ సభకు కేసీఆర్ కనీసం స్థలం ఇవ్వలేదు’’ అని రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.