Revanth Reddy : మద్దతు ఒకరికి ఇచ్చి మరొకరిని ప్రశ్నిస్తే ఎలా?

ABN , First Publish Date - 2023-08-15T12:10:00+05:30 IST

ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరోక్షంగా చురకలు అంటించారు. వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ కమిట్మెంట్‌ను ఎవరూ శంకించాల్సిన అవసరం లేదన్నారు. మాట ఇచ్చిన వాళ్ళని ప్రశ్నించి మీ చిత్తశుద్ది నిరూపించుకోండని మందకృష్ణకి పరోక్షంగా చురకలు అంటించారు.

Revanth Reddy : మద్దతు ఒకరికి ఇచ్చి మరొకరిని ప్రశ్నిస్తే ఎలా?

హైదరాబాద్ : ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరోక్షంగా చురకలు అంటించారు. వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ కమిట్మెంట్‌ను ఎవరూ శంకించాల్సిన అవసరం లేదన్నారు. మాట ఇచ్చిన వాళ్ళని ప్రశ్నించి మీ చిత్తశుద్ది నిరూపించుకోండని మందకృష్ణకి పరోక్షంగా చురకలు అంటించారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి దేవుడు ఇచ్చిన అన్న కదా.. అయన్ని ఎందుకు అడగడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వర్గీకరణ విషయంలో తమ చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సిన పని లేదన్నారు. మద్దతు ఒకరికి ఇచ్చి మరొకరిని ప్రశ్నిస్తే ఎలా? కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ కూడా వర్గీకరణపై స్పష్టంగా మా విధానాన్ని చెప్పారని రేవంత్ అన్నారు.

వర్గీకరణకి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణ వ్యక్తుల కోసం చేయబోమని.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ పై కాంగ్రెస్‌కు స్పష్టమైన విధానం ఉందన్నారు. ధామాషా పద్ధతి ప్రకారం వర్గీకరణ ఎలా చేయాలో తమకు తెలుసన్నారు. మా చిత్తశుద్ధి పై ఎవరికి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఎవరి వకాల్తాలు తమకు అవసరం లేదని రేవంత్ అన్నారు. ఎవరి బెదిరింపులకూ భయపడేది లేదన్నారు. బెదిరించే వారు ఎవరికి మద్దతు ఇచ్చారో వారినే అడిగితే మంచిదన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి కాంగ్రెస్ ఏంటో తెలుసన్నారు. కిషన్ రెడ్డి ఎందుకు పార్లమెంట్‌లో మాట్లాడం లేదని ప్రశ్నించారు. వాళ్ళ ప్రభుత్వంపై ఎందుకు ఓత్తిడి తేవడం లేదన్నారు. మాట ఇచ్చి అమలు చేయని వారిని నిలదీసి మీ చిత్తశుద్ధి నిరూపిస్తే కొంతైనా మీకు గౌరవం ఉంటుందని రేవంత్ హితవు పలికారు.

Updated Date - 2023-08-15T12:10:00+05:30 IST