ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

REVANTHREDDY: సీతక్క ఆ విషయంలో కన్నీరు పెట్టాల్సి వచ్చేది కాదు

ABN, First Publish Date - 2023-08-05T00:00:12+05:30

వరద బాధితుల(Flood victims)కు నష్టపరిహారం(compensation) ఇవ్వకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని (BRS GOVT) ఎవరైనా అడ్డుకున్నారా? అని టీపీసీసీ అద్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి(REVANTHREDDY) ప్రశ్నించారు.

హైదరాబాద్: వరద బాధితుల(Flood victims)కు నష్టపరిహారం(compensation) ఇవ్వకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని (BRS GOVT) ఎవరైనా అడ్డుకున్నారా? అని టీపీసీసీ అద్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి(REVANTHREDDY) ప్రశ్నించారు. శుక్రవారం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం చచ్చిపోయిందా? మున్సిపల్ మంత్రి కేటీఆర్( Minister KTR) వరదల్లో కొట్టుకుపోయారా? రాష్ట్రంలో మంత్రులు లేరా? అని నిలదీశారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుని ఉంటే సీతక్క(Sitakka)లాంటి ఎమ్మెల్యేలు కన్నీరు పెట్టాల్సి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. వరదబాధిత ప్రాంతాల్లో తిరగాల్సిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రౌడీల్లా వీధుల్లో తిరుగుతున్నారని మండిపడ్డారు.

శాసనసభలో శ్రీధర్ బాబు(Shridhar Babu) ప్రశ్నిస్తుంటే మంత్రులు అడ్డుకుంటున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.పెద్దపల్లిలో దాసరి మనోహర్ రెడ్డి దేవుడి మాన్యాలను వదలడం లేదన్నారు. ఈసారి మనోహర్‌రెడ్డిని ఆ దేవుడు కూడా కాపాడలేడన్నారు.ప్రజల్లో ఉండి ప్రజలకోసం కొట్లాడుతున్నామని.. ‘‘ మీకోసం మేముంటాం. మాకోసం మీరు ఉండండి’’ అని రేవంత్ ధైర్యం చెప్పారు.


పార్టీ జెండా మోసినవారిని కాంగ్రెస్ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల కేసీఆర్ కుటుంబం 10వేల ఎకరాలను కబ్జా చేశారని... లక్ష కోట్లు వెనకేసుకున్నారని దుయ్యబట్టారు. త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుందన్నారు.కేసీఆర్‌కు తెలంగాణతో రుణం తీరిపోయింది. ఆయనకు తెలంగాణకు మోజు తీరిందని అందుకే వరద ప్రాంతాల్లో పర్యటించకుండా మహారాష్ట్రకు వెళ్లారని ఎద్దేవ చేశారు. మహారాష్ట్రలో పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ తెలంగాణ రైతులపై లేదని చెప్పారు.మన క్షేమం పట్టని కేసీఆర్ మనకు అవసరమా? అని ప్రశ్నించారు. నిజంగా తెలంగాణను బంగారు తెలంగాణ చేసుంటే.. సిట్టింగులందరికీ సీట్లు ఇవ్వు.. నువ్ గజ్వేల్ నుంచి పోటీ చెయి అని కేసీఆర్‌కు సూటిగా సవాల్ విసిరారు. ధర్మయుద్ధం చేయాల్సిన సమయం వచ్చేసిందని..ఈ యుద్ధంలో గెలిచేది కాంగ్రెస్సేనని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్త తీసుకోవాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Updated Date - 2023-08-05T00:00:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising