ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mallu Ravi: రేవంత్ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన మల్లు రవి

ABN, First Publish Date - 2023-07-11T17:30:18+05:30

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేస్తామో రైతు డిక్లరేషన్‌‌లో చెప్పాం. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారు. కేంద్రంలో మూడు రైతు వ్యతిరేక చట్టాలకు కేసీఆర్ మద్దతు ఇవ్వలేదా?, నాడు వైఎస్ఆర్ రైతులకు ఉచిత కరెంటు ఇస్తుంటే కేసీఆర్ ఎక్కడి నుంచి ఇస్తారని అనలేదా?, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో ప్రభుత్వం ప్రయివేటు సంస్థలతో కుమ్మక్కై ప్రజా ధనం దుర్వినియోగం అవుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అమెరికాలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం కాదు అని ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి (Mallu Ravi) తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేస్తామో రైతు డిక్లరేషన్‌‌లో చెప్పాం. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారు. కేంద్రంలో మూడు రైతు వ్యతిరేక చట్టాలకు కేసీఆర్ మద్దతు ఇవ్వలేదా?, నాడు వైఎస్ఆర్ రైతులకు ఉచిత కరెంటు ఇస్తుంటే కేసీఆర్ ఎక్కడి నుంచి ఇస్తారని అనలేదా?, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో ప్రభుత్వం ప్రయివేటు సంస్థలతో కుమ్మక్కై ప్రజా ధనం దుర్వినియోగం అవుతుంది. కేసీఆర్ ప్రజల విశ్వాసం కోల్పోయారు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్స్‌ను కేంద్రం దృష్టికి ఏనాడైనా తీసుకువెళ్లారా? రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశాలపై రాజకీయంగా లబ్ది పొందాలని బీఆర్ఎస్ చూస్తోంది. పేరుకు 24 గంటల ఉచిత విద్యుత్ అంటున్నారు కానీ అది క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే పోలీసు రాజ్యం వస్తుంది. డిస్కంలకు ఇవ్వాల్సిన డబ్బులు ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదు.’’ అని మల్లు రవి ప్రశ్నించారు.

Updated Date - 2023-07-11T17:30:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising