YS Sharmila : రాహుల్‌కి షర్మిల జన్మదిన శుభాకాంక్షలు.. మరోసారి తెరపైకి కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనం అంశం..
ABN, First Publish Date - 2023-06-19T12:46:44+05:30
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ జన్మదినం నేడు. ఈ సందర్భంగా రాజకీయ ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా రాహుల్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల కూడా రాహుల్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని రోజులుగా కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనంపై చర్చ జరుగుతోంది. బెంగళూర్‌లో ఇదివరకే డికే శివకుమార్‌తో షర్మిల సమావేశం అయిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ జన్మదినం నేడు. ఈ సందర్భంగా రాజకీయ ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా రాహుల్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల కూడా రాహుల్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని రోజులుగా కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనంపై చర్చ జరుగుతోంది. బెంగళూర్‌లో ఇదివరకే డికే శివకుమార్‌తో షర్మిల సమావేశం అయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ హై కమాండ్‌తో షర్మిల తరపున డికే చర్చలు నిర్వహించినట్టు ప్రచారం పెద్ద ఎత్తున నడిచింది. షర్మిల పాలేరు టికెట్ హామీ పొందినట్లు సైతం ప్రచారం జరిగింది. అయితే ఈ విలీనంపై జరుగుతున్న ప్రచారాన్ని షర్మిల కొట్టి పారేవారు. రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలపడంతో మరోసారి విలీన ప్రచారం జోరందుకుంది.
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. షర్మిల పాదయాత్ర చేసినా.. ప్రభుత్వాన్ని విమర్శించినా.. ధర్నాలు చేసినా, నిరసనలు చేపట్టినా.. చివరకు రాహుల్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినా కూడా ప్రతిదీ సంచలనమే అవుతోంది. రాష్ట్రంలో ఎన్నికలు తరుముకొస్తుండటంతో షర్మిల ఏం చేయబోతున్నారు..? ఒంటిరిగానే ఎన్నికలకు వెళ్తారా..? ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటారా..? ఒకవేళ ఎన్నికలకు వెళ్తే రాష్ట్రంలో అన్ని చోట్ల పోటీచేస్తారా..? లేకుంటే పార్టీకి బలం ఉన్న చోట మాత్రమే పోటీచేస్తారా..? ఇవన్నీ పెద్ద ప్రశ్నలుగా మిగిలిపోయాయ్. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌తో కలిసి షర్మిల.. ముందుకెళ్తున్నారని అంతేకాదు విలీనం కూడా చేయబోతున్నారనే పెద్ద ఎత్తున టాక్ వచ్చింది. ఆ ఆరోపణలను షర్మిల తిప్పికొట్టినప్పటికీ ఇటీవలి పరిణామాలతో మరోసారి తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యారు. ఇందుకు కారణం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్‌తో వైఎస్ షర్మిల బెంగళూరు వెళ్లి మరీ భేటీ కావడమే. అయితే 15 రోజుల్లో ఇలా భేటీ జరగడం ఇది రెండోసారి కావడంతో అసలేం జరుగుతోంది..? ఈ వరుస భేటీల వెనుక ఆంతర్యమేంటి..? అని సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఓ రేంజ్‌లో వార్తలు వచ్చాయి. అయితే వైఎస్సార్ పేరు మీద పార్టీ పెట్టింది.. ఏ పార్టీలోనో విలీనం చేయడానికి కాదని షర్మిల స్పష్టం చేశారు.
Updated Date - 2023-06-19T12:57:48+05:30 IST