ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YSRTP: కాంగ్రెస్‌లో విలీనం కానున్న షర్మిల పార్టీ..?

ABN, First Publish Date - 2023-08-09T16:42:10+05:30

హైదరాబాద్: కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనం కానున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో చేరేందుకు షర్మిల సిద్ధమయ్యారు. ఎలాంటి షరతులు లేకుండానే విలీనానికి షర్మిల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

హైదరాబాద్: కాంగ్రెస్‌ (Congress)లో షర్మిల పార్టీ (Sharmila Party) విలీనం కానున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) సమక్షంలో చేరేందుకు షర్మిల సిద్ధమయ్యారు. ఎలాంటి షరతులు లేకుండానే విలీనానికి షర్మిల గ్రీన్ సిగ్నల్ (Green Signal) ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే కార్యకర్తలు, నేతల అభిప్రాయాలను ఆమె తీసుకున్నారు. విలీనం అయ్యాక పాలేరు నుంచి షర్మిల బరిలోకి దిగనున్నారు. అయితే కాంగ్రెస్, వైఎస్సార్‌టీపీ (YSRTP) అధికారికంగా ఇంకా తేదీని ఖరారు చేయలేదు.

గతంలో వైఎస్ జయంతి (YS Jayanthi) సందర్భంగా షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారంటూ రకరకాల వార్తలు వచ్చాయి. ఇడుపులపాయకు సోనియాతో పాటు రాహుల్ గాంధీ (Rahul Gandhi) వస్తున్నారని అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి. అయితే అది ముందుకు సాగలేదు. ఎట్టకేలకు ఈ వారంలో షర్మిల పార్టీకి సంబంధించిన విషయంలో కీలకమైన పరిణామం చోటు చేసుకోబోతోంది. కాగా గతంలో రేవంత్ (Revanth) వర్గం షర్మిల పార్టీని విలీనం చేసే అంశాన్ని వ్యతిరేకించారని, మరికొంతమంది షర్మిల రాకను స్వాగతిస్తున్నామని చెప్పి రకరకాల వార్తలు వచ్చాయి. ఏదీ ఏమైనప్పటికీ ఈ వారంలో షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అవకాశమున్నట్లు సమాచారం.

Updated Date - 2023-08-09T16:44:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising