Sharmila: కేసీఆర్‌ పాలనపై 10 ప్రశ్నలతో షర్మిల పోస్టర్ విడుదల

ABN , First Publish Date - 2023-06-01T13:59:54+05:30 IST

హైదరాబాద్: కేసీఆర్‌ పాలనపై 10 ప్రశ్నలతో కూడిన పోస్టర్‌ను వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల విడుదల చేశారు. వాటికి కేసీఆర్ సమాధానాలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

Sharmila: కేసీఆర్‌ పాలనపై 10 ప్రశ్నలతో షర్మిల పోస్టర్ విడుదల

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ (CM KCR) పాలనపై 10 ప్రశ్నలతో కూడిన పోస్టర్‌ (Poster)ను వైఎస్సార్‌టీపీ (YSRTP) అధ్యక్షురాలు షర్మిల (Sharmila) విడుదల చేశారు. వాటికి కేసీఆర్ సమాధానాలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె గురువారం హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. కేసీఆర్‌తో బీజేపీ డ్యూయట్ పాడితే.. కాంగ్రెస్.. కేసీఆర్ మోచేతి నీళ్లు తాగిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ విలీనం ఉండదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో ఎందుకు పొత్తు పెట్టుకోవాలి?.. గెలిచాక వాళ్లు అమ్ముడు పోవడానికా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు సప్లైంగ్ కంపెనీలా కాంగ్రెస్ మారిందని షర్మిల వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్రం కేవలం లీక్కర్‌లో మాత్రమే అబివృద్ధి చెందిందని షర్మిల అన్నారు. సీఎం కేసీఆర్ రైతు బంధు ఇచ్చి మీగతా అన్నింటినీ బంద్ చేశారని షర్మిల విమర్శించారు. రూ. 30 వేల కోట్ల విలువైన భూములను అమ్ముకున్నారని రాష్ట్రంలో 36 లక్షల మందికి ఇల్లు లేవని .. ఇప్పటి వరకు ఎంత మందికి ఇళ్లులు ఇచ్చారో చెప్పాలన్నారు. దళిత బంధులో అవినీతి జరుగుతుందని సీఎం కేసిఆర్‌కు తెలిసిన కూడా వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదన్నారు. 9 ఏళ్లలో రాష్ట్రం ఎవరికి బంగారు తెలంగాణ అయ్యిందని ప్రశ్నించారు. మిగులు బడ్జెట్‌ను అప్పుల కుప్పలుగా మార్చారని దుయ్యబట్టారు. అప్పులు చేసి తెచ్చిన డబ్బు ఏమైందన్నారు. ఇంత అప్పు చేసిన రుణ మాఫీ ఎందుకు చేయలేదని నిలదీశారు. రూ. 70 వేల కోట్ల అవినీతి ఒక్క కాళేశ్వరంలోనే చేశారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ లక్షల కోట్లు దోచుకున్నారన్నారు. దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు ఖర్చు చేసేంత డబ్బు సీఎం కేసిఆర్‌కు ఎక్కడిదని షర్మిల ప్రశ్నించారు.

Updated Date - 2023-06-01T13:59:54+05:30 IST