ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TSPSC Leakage Case: నిందితుల కస్డడీ కోరుతూ నాంపల్లి కోర్టులో సిట్ పిటిషన్

ABN, First Publish Date - 2023-03-24T12:25:42+05:30

టీఎస్‌పీఎస్సీ కేసులో ముగ్గురు నిందితులను కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ కేసు (TSPSC Paper Leakage Case) లో ముగ్గురు నిందితులను కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టు (Nampalli Court) లో సిట్ అధికారులు (SIT Officials) పిటిషన్ దాఖలు చేశారు. రమేష్, సురేష్, షమీమ్‌లను ఏడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ కేసులో ఇప్పటికే 12 మంది అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా నిన్న అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులకు కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.

ఈ కేసుకు సంబంధించి మొత్తం 19మంది సాక్ష్యులను సిట్ విచారించింది. ఫిర్యాదుదారుడు అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకరలక్ష్మిని సిట్ సాక్షులుగా చేర్చింది. ప్రవీణ్, రాజశేఖర్ వద్ద పనిచేసిన జూనియర్ అసిస్టెంట్‌లను అలాగే కర్మన్ ఘాట్‌లోని ఆర్ స్క్వేర్ హోటల్ యజమాని, సిబ్బందిని సిట్ సాక్ష్యులుగా చేర్చింది. ఈ నెల 4న ఆర్ స్క్వేర్ హోటల్‌లో నీలేష్, గోపాల్‌తో పాటు డాక్యా బస చేశారు. హోటల్‌లో నిందితులు రెండు రూంలు తీసుకున్నారు. ఆర్ స్క్వేర్ హోటల్‌‌లో 107, 108 రూంలలో ప్రశ్నాపత్రం చూసి ప్రిపేర్ అయిన ఇద్దరు నిందితులు... తర్వాత నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లారు. హోటల్‌లో సీసీ కెమెరాలతో పాటు, సిబ్బంది వాంగ్మూలాన్ని సిట్ నమోదు చేసుకుంది.

రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు...

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగు చూశాయి. నిందితుల రిమాండ్ రిపోర్ట్ ఏబీఎన్ చేతికి చిక్కింది. ఇప్పటి వరకూ 12 మంది నిందితులను ఆరెస్ట్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ పేర్కొంది. తొమ్మిది మంది నిందితులతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ముగ్గురిలో ఇద్దరు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు ఉన్నారు. ఇప్పటి వరకూ మొత్తంగా నలుగురు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులను అధికారులు అరెస్ట్ చేశారు. A1ప్రవీణ్ టీఎస్‌పీఎస్సీ సెక్రెటరీ పీఏ, A2 రాజశేఖర్, నెట్వర్క్ అడ్మిన్, A10 షమీమ్ ఏఎస్‌ఓ, A12 రాజశేఖర్ డాటా ఎంట్రీ ఆపరేటర్ అరెస్టైన వారిలో ఉన్నారు.

నిందితుల్లో మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులున్నట్టు రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ పేర్కొంది. 19 మంది సాక్ష్యులను విచారించినట్టు రిమాండ్ రీపోర్ట్‌లో సిట్ పేర్కొంది. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి శంకర్ లక్ష్మిని ప్రధాన సాక్షిగా సిట్ పేర్కొంది. శంకర్ లక్ష్మితో పాటు టీఎస్‌పీఎస్సీ, తెలంగాణ స్టేట్ టెక్నీకల్ సర్వీస్ ఉద్యోగులను సాక్షులుగా సిట్ వెల్లడించింది. కర్మన్ ఘాట్‌లోని ఒక హోటల్‌లోని యాజమని, ఉద్యోగిని సాక్షిగా సిట్ తెలిపింది. హోటల్‌లోని సీసీటీవి కెమెరాలో పేపర్ ఎక్సేంజ్ వ్యవహారం నిక్షిప్తమైంది. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు షమీమ్, రమేష్, సురేష్‌లను సిట్ అరెస్ట్ చేసింది. ముగ్గురు నిందితుల నుంచి ఒక ల్యాప్ టాప్, మూడు మొబైల్ ఫోన్స్‌ను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2023-03-24T12:25:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising