Share News

TS Assembly: హరీష్‌రావు ప్రశ్నకు మంత్రి శ్రీధర్‌బాబు ఎమన్నారంటే..

ABN , Publish Date - Dec 20 , 2023 | 12:19 PM

హైదరాబాద్: షాట్ డిస్కషన్‌పై 42 పేజీల బుక్‌ను ఇచ్చి నాలుగు నిముషాలు కూడా కాలేదని, అది చదవకుండానే మమ్మల్ని మాట్లాడమంటే ఎలా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.

TS Assembly: హరీష్‌రావు ప్రశ్నకు మంత్రి శ్రీధర్‌బాబు ఎమన్నారంటే..

హైదరాబాద్: షాట్ డిస్కషన్‌ (Shot discussion)పై 42 పేజీల బుక్‌ను ఇచ్చి నాలుగు నిముషాలు కూడా కాలేదని, అది చదవకుండానే మమ్మల్ని మాట్లాడమంటే ఎలా అని మాజీ మంత్రి హరీష్ రావు (Harishrao) ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridharbabu) మాట్లాడుతూ చర్చ ప్రారంభించిన వెంటనే పేపర్స్ ఇచ్చారని అంటున్నారని.. గతంలో అన్ని సందర్భాల్లో ప్రతి షాట్ డిస్కషన్‌పై చర్చ మొదలవ్వగానే పేపర్స్ రిలీజ్ చేయడం జరిగిందన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తాము కూడా ఇదే ప్రస్తావన తీసుకువచ్చామన్నారు. అయితే తాము మార్పు తీసుకువచ్చే ప్రయత్నంలోనే ఉన్నామని, వచ్చే బడ్జెట్ సమావేశం నుంచి తప్పకుండా హరీష్ రావు సూచనను అమలు చేసే ప్రయత్నం చేస్తామని మంత్రి శ్రీధర్ బాబ స్పష్టం చేశారు.

కాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేత పత్రం విడుదల చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో శ్వేత పత్రం విడుదల చేశారు. రోజువారీ ఖర్చులకు కూడా అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. పదేళ్లలో రాష్ట్రం దివాలా తీసిందన్నారు. ఆర్థిక అరాచకత్వాన్ని ప్రజలకు చెప్పాల్సిన భాధ్యత తమపై ఉందన్నారు.

అంతకుముందు సభ ప్రారంభమవగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ సంతాప తీర్మానాలను పెట్టారు. మెదక్ జిల్లా పూర్వ రామాయంపేట మాజీ ఎమ్మెల్యే రామన్నగారి శ్రీనివాస్ రెడ్డి మృతిపట్ల సభ సంతాపం.. ఆయన కుటుంబానికి శాసనసభ ప్రగాఢ సానుభూతి తెలిపింది. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరిశ్వర్ రెడ్డి.. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి మృతి పట్ల సభ సంతాపాన్ని తెలిపింది. ఈ ముగ్గురు మాజీ శాసన సభ్యులకు సంతాపంగా సభ రెండు నిమిషాలపాటు మౌనం పాటించింది.

Updated Date - Dec 20 , 2023 | 12:19 PM