Kishan Reddy: బీజేపీ పోరాటాలను అణచివేసేందుకు కేసీఆర్ యత్నం
ABN, First Publish Date - 2023-09-14T11:49:34+05:30
బీజేపీ పోరాటాలను అణిచి వేసేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్: బీజేపీ (BJP) పోరాటాలను అణిచి వేసేందుకు కేసీఆర్ (CM KCR) ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి (Telangana BJP Chief Kishan Reddy) ఆరోపించారు. గురువారం బీజేపీ కార్యాలయంలో 24 గంటల ఉపవాస దీక్షను విరమించిన అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఏ ఒక్క వర్గానికి నిరసన తెలియజేసే పరిస్థితి లేదన్నారు. ముఖ్యమంత్రి రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. బయట ఉద్యమాలు చేయవద్దు, అసెంబ్లీలో మాట్లాడవద్దు అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. శాంతియుతంగా నిరసన చేస్తుంటే బీజేపీ కార్యకర్తలపై విపరీతంగా దాడులు చేశారని.. ఈ దాడులలో అనేక మంది కార్యకర్తలకు గాయాలయ్యాయన్నారు.
‘‘నీవు తెలంగాణ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చని కోరాం. తెలంగాణ వేస్తే నా తమ్ముళ్లకు, అన్నలకు, అక్కలకు, చెల్లెళ్లకు ఉద్యోగాలు వస్తాయని లేఖలు రాసి ఆత్మహత్య చేసుకున్నారు. కారుకూతలు కూసే కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు హామీ లను నెరవేర్చలేదు. నాకు ఉద్యోగం రాదన్న బాధతో మరోమారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు యువత. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఒక్క టీచర్, లెక్షరర్, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయని దుర్మార్గపు ప్రభుత్వం ఇది. నియామక పరీక్షలు నిర్వహించే టీఎస్పీఎస్సీలో కూడా ఖాళీలు ఉన్నాయి. ప్రతి నెలా ఎలాంటి లోటూ పాట్లు లేకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో నియామకాలు చేస్తున్నాం. పేపర్ లీకేజ్ అయితే పరీక్షలకు సిద్ధమైన యువకులు కుటుంబం ఎంత బాధపడుతుందో ఆలోచన చేశావా కేసీఆర్. ఆ నాడు 369మంది యువకులు పోలీసు తూటాలకు బలైంది ఈ నియామకాల కోసమే . తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ స్థాయి లో అప్పటి ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదు. నేడు పోలీసులు వ్యవహరించిన తీరుగా ఉద్యమంలో పోలీసులు వ్యవహరించి ఉంటే నీ కొడుకు, కూతురు అమెరికా పారిపోయే వారు.కేసీఆర్ ఏనాడూ సకల జనుల సమ్మె, సాగర హారంలో పాల్గొన లేదు. ఉద్యమ పోరాటం నుంచి పారిపోయిన వ్యక్తి మీ అయ్య కేటీఆర్. మీ సర్టిఫికెట్ మాకు అవసరం లేదు. ప్రజల ఆశీస్సులు మాపై ఉన్నాయి. తెలంగాణ రాకముందు మనను కాంగ్రెస్ పార్టీ దోచుకుంది .. ఉద్యమకారులను కాల్చి చంపింది. కాంగ్రెస్ హయాంలో పోలీసులు కాల్పులు తెలంగాణ ప్రజలు మరువకూడదు. తెలంగాణ సమాజంపై కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా వ్యవహరించిందో ప్రజలు గుర్తుంచుకోవాలి. ఎన్నికల్లో చిన్న పొరపాటు జరిగినా ప్రజాస్వామ్యం మరచిపోవాలి.. నిజాం పాలన ఎదురు చూడాల్సి వస్తుంది. తెలంగాణ సమాజమా మేలుకో .. అర్థం చేసుకోండి. సోనియా, కేసీఆర్ కుటుంబాలు అత్యంత సన్నిహితమైన కుటుంబాలే. కాంగ్రెస్‌ను సమర్థిస్తే బీఆర్ఎస్‌ను సమర్థించినట్టే... బీఆర్ఎస్‌ను సమర్థిస్తే కాంగ్రెస్‌ను సమర్థించినట్టే. ఈ రెండు పార్టీలు తెలంగాణా ప్రజల పాలిట శాపంగా మారుతాయి. ఈ రెండు పార్టీలకు గురువు అసదుద్దీన్ ఓవైసీ... ఆయన ఏది రాసిస్తే వాళ్ళు అదే మాట్లాడుతారు. మీ కుటుంబం నుంచి మేం పాటాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు కేసీఆర్. కల్వకుంట్ల కుటుంబం, ఎంఐఎం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుంది. బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని ఖాళీలను భర్తీ చేస్తుందిజ. ఎలాంటి పొరపాట్లు లేకుండా యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం. నిరుద్యోగుల ఆకాంక్ష లు నెరవేరుస్తాం... ముద్రా రుణాల ద్వారా యువతను ఉద్యోగాలు ఇచ్చే లా తీర్చి దిద్దుతాం. నిన్న (బుధవారం) ఇందిరా పార్క్‌లో బీజేపీ కార్యకర్తలు పోలీసులకు చెమటలు పట్టించి, కేసీఆర్ గుండెల్లో గుబులు రేపేలా చేసిన వారికి నేను సెల్యూట్ చేస్తున్నాను’’ అంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-09-14T11:49:34+05:30 IST