ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP: డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం తెలంగాణ బీజేపీ పోరుబాట

ABN, First Publish Date - 2023-08-12T15:35:47+05:30

పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం బీజేపీ పోరుబాట పట్టింది.

హైదరాబాద్: పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం బీజేపీ పోరుబాట పట్టింది. ఇందులో భాగంగా శనివారం తెలంగాణ బీజేపీ కార్యాచరణను ప్రకటించింది. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి (Telangana BJP Chief Kishan reddy) మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూం ఇండ్లపై ఉద్యమం చేపడతామని అన్నారు. ఈ నెల 16,17 తేదీల్లో బస్తీల సమస్యలపై "బస్తీల బాట" చేపడతామని.. బస్తీ, పేద ప్రజలను కలిసి సమస్యలపై దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. 18న డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టనున్నట్లు చెప్పారు. అలాగే 23, 24 తేదీల్లో అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామని, వచ్చే నెల 4న డబుల్ బెడ్ రూం ఇండ్ల సమస్యపై హైదరాబాద్‌లో విశ్వరూప ధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ (CM KCR) కండ్లు తెరిపించే విధంగా ధర్నా ఉంటుందన్నారు. ఇండ్లు ఇస్తారా.. గద్దె దిగుతారా అని టీఆర్‌ఎస్ నాయకులను ప్రశ్నించాలని.. నిలదీయాలని నేతలకు పిలునిచ్చారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు రావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రజాకార్ల ప్రభుత్వమని పేద ప్రజలంతా బీజేపీతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఫామ్ హౌస్‌లో, ప్రగతి భవన్‌లో నిద్ర పోతున్నది కేసీఆర్ ప్రభుత్వమని విరుచుకుపడ్డారు. వరదలొచ్చిన సీఎం కేసీఆర్ బయటకు రారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-08-12T15:35:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising