ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana EAMCET : ఇంజినీరింగ్‌లో మొదటి ఐదు ర్యాంకులు అబ్బాయిలవే..

ABN, First Publish Date - 2023-05-25T10:06:52+05:30

నేడు తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు వెలువడ్డాయి. ఉదయం 9.30 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) ఫలితాలను విడుదల చేశారు. ఇక ఇంజినీరింగ్‌లో 80 శాతం ఉత్తీర్ణత, అగ్రికల్చర్‌, ఫార్మాలో 86 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ ఎంసెట్‌లో సైతం బాలికలదే పై చేయి. ఇంజినీరింగ్‌లో 79 శాతం మంది అబ్బాయిలు, 82 శాతం మంది అమ్మయిలు క్వాలిఫై అయ్యారు. ఇంజినీరింగ్‌లో అనిరుధ్ అనే విద్యార్థికి మొదటి ర్యాంకు లభించింది. ఇంజినీరింగ్‌లో వెంకట మణిందర్ రెడ్డికి సెకండ్ ర్యాంకు లభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : నేడు తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు వెలువడ్డాయి. ఉదయం 9.30 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) ఫలితాలను విడుదల చేశారు. ఇక ఇంజినీరింగ్‌లో 80 శాతం ఉత్తీర్ణత, అగ్రికల్చర్‌, ఫార్మాలో 86 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ ఎంసెట్‌లో సైతం బాలికలదే పై చేయి. ఇంజినీరింగ్‌లో 79 శాతం మంది అబ్బాయిలు, 85 శాతం మంది అమ్మయిలు క్వాలిఫై అయ్యారు. ఇంజినీరింగ్‌లో అనిరుధ్ అనే విద్యార్థికి మొదటి ర్యాంకు లభించింది. వెంకట మణిందర్‌ రెడ్డికి సెకండ్ ర్యాంకు లభించింది.

తెలంగాణ ఎంసెట్ టాపర్స్

అగ్రికల్చరల్ అండ్ ఫార్మా టాపర్స్

1.బూరుగుపల్లి సత్య ఫస్ట్ ర్యాంక్

2.నాసిక వెంకట తేజ

3.పసుపులేటి లక్ష్మి

4.దుర్గంపూడి కార్తికేయ రెడ్డి

5.బుర్ర వరుణ్ తేజ

ఇంజనీరింగ్ విభాగంలో టాపర్స్

1. సనపల్ల అనిరుద్ ఫస్ట్ ర్యాంక్

2. యాకంటి మనిందర్ రెడ్డి

3.చల్ల ఉమేష్ వరుణ్

4.అభినిత్ మంజెటి

5.పన్నతోట ప్రమోద్ కుమార్ రెడ్డి

కాగా ఈ నెల 10, 11 తేదీల్లో ఎం సెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 12 నుంచి 15 వరకు ఆరు విడుతల్లో ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలు జరిగాయి. ఇంజినీరింగ్ పరీక్షకు లక్షా 95 వేల 275 మంది విద్యార్థులు హాజరయ్యారు. అగ్రికల్చర్ పరీక్షను లక్షా 6 వేల మంది విద్యార్థులు రాశారు. ఇటీవల ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను విడుదల చేసి అభ్యంతరాలను అధికారులు స్వీకరించారు. కాగా.. ఎంసెట్ ఫ‌లితాల కోసం www.ntnews.com, eamcet.tsche.ac.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.

తెలంగాణలో 96.35%, ఆంధ్రప్రదేశ్‌లో 92.50% హాజరు నమోదైంది. హైదరాబాద్‌లో అత్యధికంగా 97శాతం మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్ష రాశారు. ఈ నెల 10, 11 తేదీల్లో అగ్రికల్చర్‌.. 12, 13, 14 తేదీల్లో ఇంజనీరింగ్‌ విభాగం పరీక్షలను నిర్వహించారు. అగ్రికల్చర్‌ ప్రిలిమినరీ కీ ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ కీపై అభ్యంతరాలకు అవకాశం కల్పించారు. అలాగే ఇంజనీరింగ్‌ ప్రిలిమినరీ కీని ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రకటించారు. ఈ ఏడాది ఎంసెట్‌కు 3,20,683 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 3,01,789 మంది పరీక్ష రాశారు. 94.11% మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

Updated Date - 2023-05-25T10:17:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising