Bandi Sanjay Arrest Row: బీజేపీ హెబియస్ కార్పస్ పిటిషన్‌కు హైకోర్టు అనుమతి

ABN , First Publish Date - 2023-04-05T15:01:57+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌ను నిరసిస్తూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌కు హైకోర్టు అనుమతించింది.

Bandi Sanjay Arrest Row: బీజేపీ హెబియస్ కార్పస్ పిటిషన్‌కు హైకోర్టు అనుమతి

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay) అరెస్ట్‌ను నిరసిస్తూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌ (habeas corpus petition)కు హైకోర్టు అనుమతించింది. రేపు(గురువారం) ఉదయం ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగనుంది. అయితే హౌస్‌ మోషన్ విచారణకు హైకోర్టు నిరాకరించింది. రెగ్యులర్ విచారణ జరుపుతామని న్యాయస్థానం తెలిపింది. అర్ధరాత్రి బండి సంజయ్‌ అక్రమ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ హైకోర్టులో తెలంగాణ బీజేపీ లీగల్ సెల్ హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేసింది. మొత్తం ఆరుగురిని బీజేపీ ప్రతివాదులుగా చేర్చింది. హోం శాఖ కార్యదర్శి, డీజీపీ, కరీంనగర్ రాచకొండ సీపీలు, బొమ్మలరామారం సీఐలను ప్రతివాదులుగా చేర్చుతూ బీజేపీ (BJP) పిటిషన్‌ను దాఖలు చేసింది. బండి సంజయ్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని... అరెస్టు సమయంలో పాటించాల్సిన కనీస నిబంధనలు పోలీసులు పాటించలేదని పేర్కొన్నారు. అరెస్టు విషయాన్ని కుటుంబ సభ్యులకు, పార్టీ సభ్యులకు పోలీసులు వెల్లడించలేదని తెలిపారు. సీఆర్పీసీ 50 కింద అరెస్టు విషయాన్ని తప్పనిసరిగా కుటుంబ సభ్యులకి చెప్పాలని అన్నారు. తన అత్తగారి 10వ దినంకు హాజరుకావాల్సి ఉన్నందున బండి సంజయ్‌ కరీంనగర్‌కు వెళ్లారని.. రాత్రి 11:30 నిమిషాలకు అక్రమంగా బండి సంజయన్‌ను అరెస్టు చేశారని పిటిషన్‌లో బీజేపీ పేర్కొంది. పిటిషన్‌ను అనుమతించిన హైకోర్టు.. రేపు విచారణ జరుపనుంది.

Updated Date - 2023-04-05T15:10:25+05:30 IST