ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy: కాంగ్రెస్‌ను తిట్టడానికే శాసనసభ పెట్టినట్లుంది

ABN, First Publish Date - 2023-08-08T17:15:58+05:30

ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణం తెలంగాణ ప్రజలను కన్నీటి దుఃఖంలో ముంచి వేసింది. దళితులకు, గిరిజనులకు ఎవరికి ఏ దుఃఖం ఉన్న ఆ దుఃఖం నాది అని గద్దర్ ప్రయాణం జరిగింది. గద్దర్ మృతి తెలిసి అన్ని పనులు మానుకుని భౌతికకాయం దగ్గరకు వెళ్లాం. గద్దర్ మరణం రాజకీయం కావొద్దు అని మాట్లాడలేదు. నిఘా అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు

ఢిల్లీ: గద్దర్ పాటలు తెలంగాణ ప్రజలను ఆలోచింప చేశాయని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఢిల్లీలో రేవంత్ మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణం తెలంగాణ ప్రజలను కన్నీటి దుఃఖంలో ముంచి వేసింది. దళితులకు, గిరిజనులకు ఎవరికి ఏ దుఃఖం ఉన్న ఆ దుఃఖం నాది అని గద్దర్ ప్రయాణం జరిగింది. గద్దర్ మృతి తెలిసి అన్ని పనులు మానుకుని భౌతికకాయం దగ్గరకు వెళ్లాం. గద్దర్ మరణం రాజకీయం కావొద్దు అని మాట్లాడలేదు. నిఘా అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (CM Kcr) గద్దర్ మృతిని తెలియజేశారు. అసెంబ్లీలో గద్దర్‌పై చర్చ, నివాళి అర్పించి ఉంటే బాగుండు. అసెంబ్లీ సమావేశాల్లో వరదలు, విద్యార్థుల సమస్యలు, ఏ అంశంలపై చర్చ జరపలేదు. కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ అతి తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ (KTR) సభను మొత్తం నాపై తిప్పారు. రేవంత్ రెడ్డిని దూషించడానికి, కాంగ్రెస్‌ను దోషిని చేసే ప్రయత్నం చేశారు. తండ్రి, కొడుకుల ముందు కొన్ని ప్రశ్నలు పెడుతున్నా. నేనూ, కేసీఆర్.. టీడీపీ నుంచి వచ్చిన వారమే. చంద్రబాబు సహాచరుడిగా నా ప్రస్థానం టీడీపీలో కొనసాగింది. చంద్రబాబు అనుచరుడిగా కేసీఆర్ ప్రయాణంలో టీడీపీలో మొదలైంది. నిలువ నీడలేని కేసీఆర్‌కి టీడీపీ ఆసరా అయింది. నేను ఎమ్మెల్సీగా గెలిచి టీడీపీకి వెళ్లాను. జూబ్లీహిల్స్ లాంటి సొసైటీకి డైరెక్టర్‌గా అత్యంత పిన్న వయసులో ఎన్నికయ్యాను.’’ అని ఆయన తెలిపారు.

Updated Date - 2023-08-08T17:15:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising