ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy: ఫ్రీ కరెంట్‌పై కేసీఆర్ ఏమన్నారో ఆధారాలతో బయటపెట్టిన రేవంత్

ABN, First Publish Date - 2023-07-15T17:11:03+05:30

తానా సభల్లో ఉచిత విద్యుత్‌పై నేను మాట్లాడిన మాటలపై బీఆర్ఎస్ ప్రభుత్వం చావు అరుపులు అరుస్తుంది. మంత్రి హరీష్ రావు, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్‌ది కాదు. కేసీఆర్‌ది అని చెబుతున్నారు. 1999 ఎన్నికల మేనిఫెస్టో 8వ పేజీలో ఉచిత విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ చెప్పింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్‌లో ఉచిత విద్యుత్ వ్యవహారం అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఉచిత విద్యుత్‌పై అమెరికా తానా సభల్లో పీసీసీ అధ్యక్షుడు మాట్లాడిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ధర్నాలు, విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే అంశంపై తాజాగా గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మాట్లాడారు. ‘‘తానా సభల్లో ఉచిత విద్యుత్‌పై నేను మాట్లాడిన మాటలపై బీఆర్ఎస్ ప్రభుత్వం చావు అరుపులు అరుస్తుంది. మంత్రి హరీష్ రావు, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్‌ది కాదు. కేసీఆర్‌ది అని చెబుతున్నారు. 1999 ఎన్నికల మేనిఫెస్టో 8వ పేజీలో ఉచిత విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ చెప్పింది. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవలేదు. ప్రతిపక్షంలో ఉంది.’’ అని గుర్తుచేశారు.

‘‘టీడీపీ (TDP) అధికారంలో ఉన్నప్పుడు అప్పట్లో హెచ్‌ఆర్‌డీ డిపార్ట్‌మెంట్ మాత్రమే పాలసీలను రూపొందించేది. దానికి చైర్మన్ కేసీఆర్ (CM KCR). ఉచిత విద్యుత్ ఇవ్వడం కుదరదని కేసీఆర్ చెప్పారు. అప్పుడు తెలుగుదేశం పార్టీలో కేసీఅర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి కీలకమైనవారు. కేసీఆర్ డిప్యుటీ స్పీకర్‌గా ఉన్నప్పుడు చంద్రబాబు చెప్పులు మోసేవారు. దీనికి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వేమూరి రాధాకృష్ణ, మండవ వెంకటేశ్వరరావు ప్రత్యక్ష సాక్షులు. ఈ ఐదుగురి చుట్టూ ప్రదీక్షణలు చేసి చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఇప్పించాలంటూ కోరేవారు. 9 నెలలు అయినా చంద్రబాబు.. కేసీఆర్‌కి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. కేసీఆర్‌కి పార్టీ పెట్టడానికి మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కోటి రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఆంధ్రావాళ్లు చేసిన సాయంతోనే అప్పట్లో కేసీఆర్ పార్టీ పెట్టారు. ఇక హరీష్ రావు వార్డ్ మెంబర్‌గా గెలవకముందే కాంగ్రెస్ మంత్రిని చేసింది.‌‌’’ అని రేవంత్ తెలిపారు.

‘‘3500 సబ్ స్టేషన్లలో బీఆర్ఎస్ ఎక్కడ 24 గంటల కరెంట్ ఇచ్చినా మేము ఓట్లు అడగం. మా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లాగ్‌ బుక్‌లో వస్తున్న కరెంట్ నిరూపించారు. ప్రతి సబ్ స్టేషన్ దగ్గర గ్రామ సభలు పెడదాం, రచ్చబండ నిర్వహిద్దాం. రైతులతో చర్చ పెడదాం. ఏ సబ్ స్టేషన్‌లో 24 గంటల కరెంట్ వచ్చినా మేము ఓట్లు అడగం. రాకుంటే మీరు అడగొద్దు అని సవాలు విసురుతున్నా. బీఆర్ఎస్ 24 గంటల కరెంట్ ఇవ్వలేదు. మేము ఇచ్చిన 9 గంటల ఉచిత కరెంట్‌నే మీరు 2018 వరకు విడతల వారిగా ఇచ్చారు. బీఆర్ఎస్ 2018 మేనిఫెస్టోలో సింగరేణి బొగ్గు గనుల దగ్గర విద్యుత్ ప్లాంట్‌లు పెట్టాలని పెట్టారు. కానీ ఎలాంటి బొగ్గు గనులు లేని యాదాద్రి‌కి పవర్ ప్లాంట్ తరలించారు. అత్యంత అవినీతి పరులే కేసీఆర్ సలహాదారులుగా ఉన్నారు. నీ దగ్గర ఉన్న మంత్రులు ఏ పార్టీలో నుంచి వచ్చారు. స్పీకర్, మండలి చైర్మన్ల వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ బూట్లు నాకుతున్నారు. స్పీకర్‌గా ఉండి ప్రతిపక్షాలను విమర్శించవచ్చా? పంచాయతీకి కూడా పనికిరాని గుత్తా సుఖేందర్ రెడ్డిని రెండు సార్లు కాంగ్రెస్ ఎంపీ చేసింది. నల్గొండలో కొడుకు టికెట్ కోసం కేసీఆర్ చెప్పులు మోస్తారా? స్పీకర్, మండలి చైర్మన్‌లను గవర్నర్ బర్త్‌రఫ్ చేయాలి.’’ అని డిమాండ్ చేశారు.

‘‘మంత్రి హరీష్‌రావు రెఫరెండం సవాల్‌ను రేవంత్‌ స్వీకరించారు. ప్రతి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ దగ్గర రెఫరెండానికి సిద్ధం. అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్దాం. కేసీఆర్‌కి చీము నెత్తురు ఉంటే గజ్వేల్ నుంచి పోటీ చేయాలి. సిట్టింగ్ లందరికి సీట్లు ఇవ్వాలి. లేదంటే నువ్వు మాడా అని ఒప్పుకోవాలి. కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తే వాళ్లు ఏ శిక్ష విధించినా నేను సిద్ధం. టీడీపీ సహాయంతో కేటీఆర్ ఎమ్మెల్యే అయ్యారు.’’ అని రేవంత్‌ తెలిపారు.

Updated Date - 2023-07-15T17:45:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising