ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mallu Ravi: బండి సంజయ్‌కు జరిగినట్టుగా కాంగ్రెస్‌లో జరగదు

ABN, First Publish Date - 2023-07-18T17:47:33+05:30

దాసోజు శ్రవణ్ ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నాడనే భ్రమలో ఉన్నట్లున్నారు. ఏఐసీసీకి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు లేఖ రాశారు. రాజకీయాల్లో బూతులు తిట్టే సాంప్రదాయం కేసీఆర్ నుంచే వచ్చింది. తిట్లు తిట్టడంలో కేసీఆర్ ఒక యునివర్సిటీ పట్టభద్రుడు.

హైదరాబాద్: రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయని.. దాసోజు శ్రవణ్ కూడా ఈ కోవకు చెందిన వాడేనని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి (Mallu Ravi) వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘దాసోజు శ్రవణ్ ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నాడనే భ్రమలో ఉన్నట్లున్నారు. ఏఐసీసీకి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు లేఖ రాశారు. రాజకీయాల్లో బూతులు తిట్టే సాంప్రదాయం కేసీఆర్ (CM Kcr) నుంచే వచ్చింది. తిట్లు తిట్టడంలో కేసీఆర్ ఒక యునివర్సిటీ పట్టభద్రుడు. కేసీఆర్.. కిషన్ రెడ్డిని చేతగాని దద్దమ్మ అనలేదా?, కేసీఆర్.. ప్రతిపక్ష నాయకులని తిట్టిన తిట్లకు మేము ఎన్ని లేఖలు రాయాలి. విద్యుత్ ఇష్యూలో బీఆర్ఎస్ గొయ్యిని వారే తొవ్వుకున్నట్లు ఉంది. 24 గంటల విద్యుత్ ఇవ్వలేదని రుజువు అయ్యింది. కేసీఆర్ మాటవిని బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. బండి సంజయ్‌ను మార్చినట్లు రేవంత్ రెడ్డిని (Revanth Reddy) మార్చలేరు. రేవంత్ రెడ్డి దళిత, గిరిజన, మైనార్టీ, బీసీ పక్షపాతి. కాంగ్రెస్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీఆర్‌ఎస్ ఇలాంటి చర్యలకు పాల్పదుతోంది.’’ అని మల్లు రవి దుయ్యబట్టారు.

Updated Date - 2023-07-18T17:47:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising