BJP: కిషన్రెడ్డి దీక్షలో ఉద్రిక్తత.. పోలీసులతో బీజేపీ నాయకుల వాగ్వాదం
ABN, First Publish Date - 2023-09-13T20:21:40+05:30
ఇందిరాపార్క్ ధర్నాచౌక్(Indira Park Dharnachowk)లో బీజేపీ(BJP) చేపట్టిన దీక్ష ఉద్రికత్తలకు దారి తీసింది.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి(Kishan Reddy) చేపట్టిన దీక్షా శిబిరం దగ్గర ఉద్రిక్తత నెలకొంది.
హైదరాబాద్: ఇందిరాపార్క్ ధర్నాచౌక్(Indira Park Dharnachowk)లో బీజేపీ(BJP) చేపట్టిన దీక్ష ఉద్రికత్తలకు దారి తీసింది.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి(Kishan Reddy) చేపట్టిన దీక్షా శిబిరం దగ్గర ఉద్రిక్తత నెలకొంది.దీక్షను భగ్నం చేసేందుకు పోలీసుల ప్రయత్నం చేస్తున్నారు.నిరుద్యోగులు, బీజేపీ నేతలు పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులకు బీజేపీ నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బీజేపీ నాయకులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.దీక్షను భగ్నం చేస్తున్న పోలీసులపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దీక్షను ఆపడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.శాంతియుతంగా దీక్ష కొనసాగుతుంటే.. ఇబ్బందేంటని పోలీసులను ప్రశ్నించారు. సాయంత్రం 6 గంటల వరకే అనుమతి ఉందని పోలీసులు తెలిపారు. రేపు ఉదయం వరకు దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా దీక్ష కొనసాగుతుందని కిషన్‌రెడ్డి తెలిపారు.
Updated Date - 2023-09-13T20:21:40+05:30 IST