ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

New Assembly: ఇక కొత్త అసెంబ్లీ!

ABN, First Publish Date - 2023-08-29T02:58:08+05:30

రాష్ట్ర ప్రభుత్వం నూతన అసెంబ్లీ(New assembly) నిర్మాణంపై దృష్టి సారించింది. కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో కేసీఆర్‌ సర్కారు(KCR Govt) ‘అసెంబ్లీ’ ఫైలును కదిలించినట్లు తెలుస్తోంది.

ఎన్నికల నేపథ్యంలో మళ్లీ తెరపైకి..?

2019లోనే శంకుస్థాపన..

కోర్టు ఆదేశాలతో ఆగిన నిర్మాణ పనులు

తాజాగా ‘ఫైలు’ కదుపుతున్న సర్కారు?..

ఉన్నచోటే కట్టాలా..? నగరం వెలుపలా?

ప్రభుత్వ పెద్దలు, అధికారుల తర్జనభర్జన..

నిర్మాణానికి సరైన స్థలం కోసం అన్వేషణ

హైదరాబాద్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నూతన అసెంబ్లీ(New assembly) నిర్మాణంపై దృష్టి సారించింది. కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో కేసీఆర్‌ సర్కారు(KCR Govt) ‘అసెంబ్లీ’ ఫైలును కదిలించినట్లు తెలుస్తోంది. 2019లోనే శంకుస్థాపన చేసినప్పటికీ.. కోర్టు ఆదేశాల కారణంగా నిర్మాణ పనులు ప్రారంభమవలేదు. అప్పట్లో సీఎం కేసీఆర్‌ కొత్త సచివాలయం(New Secretariat)తో పాటు అసెంబ్లీ నిర్మాణానికీ ఎర్రమంజిల్‌లో శంకుస్థాపన చేశారు. అయితే అక్కడ వారసత్వ భవనం ఉండడంతో పలువురు హైకోర్టును ఆశ్రయించగా.. నిర్మాణ పనులు చేపట్టవద్దని సూచించింది. దీంతో కొత్త అసెంబ్లీ నిర్మాణ పనులు అటకెక్కాయి. ఆ తర్వాత సర్కారు నూతన అసెంబ్లీ నిర్మాణ పనుల ఊసెత్తలేదు. త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ అసెంబ్లీ నిర్మాణం అంశాన్ని తెరపైకి తెస్తోంది. ఇప్పటికే నూతన సచివాలయాన్ని నిర్మించుకున్నామని, అధునాతన సౌకర్యాలతో అసెంబ్లీ భవనాన్ని నిర్మించుకుందామని చెప్పడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని యోచిస్తున్నట్లు సమాచారం. నాలుగేళ్ల కిందటే శంకుస్థాపన చేసినా.. కోర్టులకు వెళ్లి నిర్మాణ పనులు ఆపారంటూ విపక్షాలపైకి నెపం నెట్టేయవచ్చనీ భావిస్తోంది. ఎన్నికలు జరగనున్నందున.. కొత్త అసెంబ్లీ నిర్మాణ అంశాన్ని అలా కొన్నాళ్లపాటు సాగదీయవచ్చన్న ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. కొత్త అసెంబ్లీ నిర్మాణానికి అనువైన స్థలం కోసం అధికారులు అన్వేషిస్తున్నట్లు సమాచారం.


హైదరాబాద్‌ నగరం లోపల, వెలుపల.. ఎక్కడ అనువైన స్థలం ఉందన్న విషయమై ఆరా తీస్తున్నారు. ప్రస్తుత ప్రాంగణంలోనే కొత్త భవనాన్ని నిర్మిస్తే ఎలా ఉంటుందన్న అంశంపైనా చర్చిస్తున్నారు. అయితే ప్రస్తుత అసెంబ్లీ ప్రాంగణంలోనూ వారసత్వ కట్టడం ఉండడంతో అక్కడ నిర్మాణానికి అనుమతులు వస్తాయో లేదో అని సందేహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌, సికింద్రాబాద్‌ పాటిగడ్డలో ఉన్న స్థలాన్ని పరిశీలించినా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. నూతన సచివాలయం కోసం పరిశీలించిన బైసన్‌పోలో గ్రౌండ్‌ అయితే ఎలా ఉంటుందన్న అంశమూ చర్చకు వచ్చినట్లు సమాచారం. కొత్త అసెంబ్లీని కనీసం 20 ఎకరాల విస్తీర్ణంలో విశాలంగా ఉండేలా నిర్మించాలని సర్కారు భావిస్తోంది. హైదరాబాద్‌కు వెలుపల అయితే.. సిబ్బంది క్వార్టర్స్‌, అతిథి గృహాలను కలిపి ఒకే దగ్గర నిర్మిస్తే బాగుంటుందని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ నగరంలో అసెంబ్లీని నిర్మిస్తే భవిష్యత్‌లో ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే సమావేశాలు జరుగుతాయి కాబట్టి.. నగరం వెలుపల ఉన్నా ఇబ్బందేమీ ఉండదని, ఆయా ప్రాంతాలకు రహదారులు, సౌకర్యాలు మెరుగవుతాయనీ భావిస్తున్నారు.

హైకోర్టు.. జిల్లా కోర్టులు కూడా..

హైకోర్టుతో పాటు జిల్లా కోర్టులను కూడా నిర్మించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. హైకోర్టు నిర్మాణానికి అనువైన భూమి కోసం ఆరా తీస్తోంది. హైకోర్టు నిర్మాణానికి బుద్వేల్‌లో 100 ఎకరాలు కేటాయిస్తామని గతంలో హామీ ఇచ్చింది. కానీ, అక్కడి భూముల్ని ఆదాయం కోసం లే అవుట్లు చేసి విక్రయించింది. దీంతో మళ్లీ అప్పటి నుంచి హైకోర్టును ఎక్కడ నిర్మించాలన్నదానిపై స్పష్టత రాలేదు. మరోవైపు జిల్లాల్లోనూ కోర్టుల నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం అనువైన స్థలాలను వెతుకుతోంది.

Updated Date - 2023-08-29T04:38:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising