CWC Meetings: సీడబ్ల్యూసీ సమావేశాల వేదిక ఖరారు చేసిన టీపీసీసీ

ABN , First Publish Date - 2023-09-04T18:48:16+05:30 IST

సీడబ్ల్యూసీ సమావేశాల(CWC meetings)ను తొలిసారి హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈమేరకు టీపీసీసీ(TPCC) వేదికను ఖరారు చేసింది.తాజ్ కృష్ణాలో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ప

CWC Meetings: సీడబ్ల్యూసీ సమావేశాల వేదిక ఖరారు చేసిన టీపీసీసీ

హైదరాబాద్: సీడబ్ల్యూసీ సమావేశాల(CWC meetings)ను తొలిసారి హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈమేరకు టీపీసీసీ(TPCC) వేదికను ఖరారు చేసింది.తాజ్ కృష్ణాలో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. పరేడ్ గ్రౌండ్‌లో టీకాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నది. ఈ సందర్భంగా సోమవారం నాడు గాంధీభవన్‌లో మీడియాతో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి(Revanth Reddy) మీడియాతో మాట్లాడుతూ.. 6వ తేదీన హైదరాబాద్‌కు కేసీ వేణుగోపాల్ వస్తారు. సీడబ్ల్యూసీ సమావేశాలు ఎక్కడ పెట్టాలి, బహిరంగ సభ ఎక్కడ పెట్టాలో కేసీ వేణుగోపాల్ డిసైడ్ చేస్తారు. సీడబ్ల్యూసీ సమావేశానికి తాజ్ కృష్ణా హోటల్, సభ కోసం పరేడ్ గ్రౌండ్ పరిశీలించాం. బోయినపల్లిలో రాజీవ్‌గాంధీ నాలెడ్జ్ సెంటర్‌కు శంకుస్థాపన చేస్తారని రేవంత్‌రెడ్డి తెలిపారు.

కాంగ్రెస్ అగ్ర నాయకులకు రేవంత్‌రెడ్డి ధన్యవాదాలు..

సీడబ్ల్యూసీ సమావేశాలు ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ అగ్ర నేతలకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.‘మాపై నమ్మకంతో హైదరాబాద్‌లో మొదటి CWC సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు సోనియాగాంధీ, మల్లికార్జనఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు ఇంతటి గౌరవాన్ని అందించినందుకు కృతజ్ఞతలు. CWC సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించాలని AICCకి లేఖ రాశాం. తెలంగాణ కాంగ్రెస్‌పై ఏఐసీసీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. CWC సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహించడానికి ఒప్పుకున్న కాంగ్రెస్ పెద్దలకు ధన్యవాదాలు.ఖర్గే హైదరాబాద్ రాష్ట్రం వ్యక్తి. రజాకార్ల చేతిలో ఖర్గే కుటుంబం చనిపోయింది. రాష్ట్ర రాజకీయాలు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక అంశాలపై CWC సమావేశాల్లో చర్చ జరుగుతుంది.సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కార్యక్రమం నిర్వహిస్తాం.జాతీయ రాజకీయాల చర్చకు CWC సమావేశాలు వేదిక కానుంది.CWC సమావేశాల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు, పొత్తులు,వ్యూహాలు, కాంగ్రెస్ బలోపేతంపై నిర్ణయాలు ఉంటాయి. కాంగ్రెస్ నాయకుల అందరం కలిసి CWC సమావేశాలను విజయవంతం చేస్తాం.ఇండియా కూటమి గెలవడానికి వ్యూహం తెలంగాణలో రూపొందుతుంది’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-09-04T21:19:17+05:30 IST