ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Assembly: విద్యుత్ బకాయిలపై హాట్ హాట్‌గా సాగిన అసెంబ్లీ

ABN, Publish Date - Dec 21 , 2023 | 05:42 PM

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ బకాయిలు ( Electricity Dues ) చెల్లించని వాటిలో సిద్దిపేట, గజ్వెల్, హైదరాబాద్ సౌత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) ప్రకటించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ బకాయిలు ( Electricity Dues ) చెల్లించని వాటిలో సిద్దిపేట, గజ్వెల్, హైదరాబాద్ సౌత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) ప్రకటించారు. విద్యుత్ బకాయిలకు సంబంధించిన ఓ నివేదికను గురువారం నాడు అసెంబ్లీ రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టినట్లు సమాచారం. అయితే ఈ నివేదికగా సభ హాట్ హాట్‌గా సాగినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ...‘‘ బకాయిలు చెల్లించని ప్రాంతాల్లో మొదటి స్థానంలో సిద్దిపేట 61.37%. రెండో స్థానంలో గజ్వేల్ 50.29%, మూడో స్థానంలో హైదరాబాద్ సౌత్ 43 శాతం ఉన్నాయి. సిద్దిపేటలో ఎమ్మెల్మే హరీశ్‌రావు.. గజ్వేల్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. హైదరాబాద్ సౌత్‌లో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ బకాయిలు చెల్లించే బాధ్యత తీసుకోవాలి. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో విద్యుత్ కోతలే లేవన్నట్లు జగదీష్‌రెడ్డి మాట్లాడారు. రైతులు రోడ్డెక్కారా అని జగదీష్‌రెడ్డి అడిగారు. కామారెడ్డిలో సెప్టెంబర్1వ తేదీన సబ్ స్టేషన్లు ముట్టడి చేసి రైతులు నిరసన తెలిపిన సంగతి జగదీష్‌రెడ్డికి గుర్తుచేస్తున్నాను’’ అని సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు.

బీఆర్ఎస్ పాలనలో పంటలు ఎండిపోయాయి..

‘‘ బీఆర్ఎస్ పాలనలోనే సూర్యాపేట జిల్లా నెరేడుచర్లలో రైతులు రోడ్డెక్కింది. కరెంటు సరిగా లేక పంటలు దక్కక కొమురయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నది బీఆర్ఎస్ పాలనలోనే. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆనాడు శ్రీశైలం విద్యుత్ సొరంగం బ్లాస్ట్ ప్రమాదంలో 9 మంది మరణించారు. ఈ ప్రమాదంలో ఫాతిమా అనే అమ్మాయి చనిపోతే కాంగ్రెస్ ఆదుకుంది. కానీ ఆనాటి సీఎం, విద్యుత్ శాఖ మంత్రి కనీసం ఆ కుటుంబాలను పరామర్శించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గాలను సభలో ఎంఐఎం కనీసం ప్రస్తావించలేదు. తన పాత స్నేహితుడిని రక్షించుకునేందుకు అక్బరుద్దీన్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారితో స్నేహం ఎంఐఎంకు మంచిది కాదు.. మైనార్టీల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్దిని శంకించాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ హయాం నుంచి కేసీఆర్ హయాం వరకు ఎవరు ఎవరితో దోస్తీ చేశారో అందరికీ తెలుసు. ఆ అంశంపై చర్చించాలంటే మరోసారి చర్చిద్దాం.. ఇప్పుడు విద్యుత్ రంగంపై శ్వేతపత్రంపై చర్చిద్దాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


కాంగ్రెస్‌, టీడీపీతో అందుకే పొత్తు పెట్టుకున్నాం: హరీశ్‌రావు

కాగా.... సీఎం రేవంత్‌రెడ్డి లెవనెత్తిన ప్రశ్నలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ( Harish Rao ) సమాధానమిస్తూ.. ‘‘సిద్దిపేట, గజ్వేల్, ఓల్డ్ సిటీలో గెలువలేదని సీఎం అక్కసు వెళ్లగక్కారు. సిద్దిపేటలో బిల్లులు బకాయి ఉంటే వసూల్ చేయండి. కానీ ప్రజలను అవమానించకండి. మేము కాంగ్రెస్‌, టీడీపీతోనైనా తెలంగాణ కోసమే పొత్తు పెట్టుకున్నాం’’ అని ఎమ్మెల్యే హరీశ్‌రావు చెప్పారు.

శ్వేతపత్రంలో ఆ విషయం చెప్పారు : కేటీఆర్

అయితే... సీఎం రేవంత్‌రెడ్డి లెవనెత్తిన ప్రశ్నలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) సమాధానమిస్తూ.. ‘‘2014వరకు 6గంటల కరెంట్ మాత్రమే ఇచ్చారు. శ్వేతపత్రంలో ప్రభుత్వమే ఈ విషయం చెప్పింది.11 సార్లు కాంగ్రెస్‌ని గెలిపిస్తే వారి అసమర్థతను బయట పెట్టుకున్నారు. నేదునూరు, శంకర్‌పల్లికి గ్యాస్ అలకేషన్ చేయలేదు కాబట్టి అవి మేము టేక్ అప్ చేయలేదు. సీఎం మా మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు’’ అని కేటీఆర్ చెప్పారు. కాగా.. సభలో కేటీఆర్‌ మాట్లాడుతుండగా స్పీకర్ గడ్డం వినోద్ మైక్ కట్ చేశారు.

బాబ్రీ మసీదు అంశం సభలో తేవద్దు: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

కాగా... ఎంఐఎం నేతలు లెవనెత్తిన ప్రశ్నలకు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ( Eleti Maheshwar Reddy ) సమాధానమిస్తూ.. ‘‘ఎంఐఎం నేత అక్బరుద్దీన్ బాబ్రీ మసీదుపై పచ్చి అబద్ధాలు మాట్లాడారు. అనవసరంగా బాబ్రీ మసీదు అంశం సభలో తేవద్దు’’ అని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Dec 21 , 2023 | 06:03 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising