ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: బీజేపీలో చేరనున్న వికాస్ రావు, కృష్ణయాదవ్

ABN, First Publish Date - 2023-08-30T10:49:19+05:30

హైదరాబాద్: మాజీ గవర్నర్ విద్యాసాగరరావు తనయుడు వికాస్ రావు, మాజీమంత్రి కృష్ణయాదవ్ బీజేపీ కండువా కప్పుకోనున్నారు. బుధవారం సాయంత్రం 4గంలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

హైదరాబాద్: మాజీ గవర్నర్ విద్యాసాగరరావు (Vidyasagar Rao) తనయుడు వికాస్ రావు (Vikas Rao), మాజీమంత్రి కృష్ణయాదవ్ (Krishna Yadav) బీజేపీ కండువా కప్పుకోనున్నారు. బుధవారం సాయంత్రం 4గంలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) సమక్షంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. కాగా వికాస్ రావు వేములవాడ బీజేపీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కృష్ణయాదవ్ అంబరుపేట టికెట్ ఆశిస్తున్నట్లు తెలియవచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్టాంపులు‌ కుంభకోణంలో కృష్ణయాదవ్ జైలుకు వెళ్ళొచ్చిన‌ విషయం తెలిసిందే.

బీజేపీలో స్తబ్దత..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీలో స్తబ్దత నెలకొంది. అభ్యర్థులను ప్రకటించడంలో కమలం పార్టీ వెనుకబడింది. అందరి కంటే ముందే బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తోందని ప్రచారం జరిగింది... కానీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో బీజేపీ పూర్తిగా వెనుకబడింది. మరోవైపు అసెంబ్లీకి అందరూ పోటీ చేయాల్సిందేనని హైకమాండ్ ఆదేశించింది. అయితే సీనియర్లు పోటీకి వెనకాడుతున్నారు. లోక్‌సభకు పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇతర పార్టీల అభ్యర్థులపైనే తెలంగాణ బీజేపీ ఆశలుపెట్టుకుంది. అభ్యర్థుల ప్రకటనలో వేచి చూసే ధోరణిలో కమలం పార్టీ ఉంది. మరోవైపు ఎన్నికల‌ సమయంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయం బోసిపోతోంది.

Updated Date - 2023-08-30T10:49:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising