YSRTP Chief: వైఎస్ షర్మిల హౌజ్ అరెస్ట్

ABN , First Publish Date - 2023-08-18T10:16:49+05:30 IST

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఈరోజు (శుక్రవారం) గజ్వేల్ నియోజకవర్గంలో షర్మిల పర్యటించనున్నారు. అయితే గజ్వేల్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు.

YSRTP Chief: వైఎస్ షర్మిల హౌజ్ అరెస్ట్

హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను (YSRTP Chief YS Sharmila) పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఈరోజు (శుక్రవారం) గజ్వేల్ నియోజకవర్గంలో షర్మిల పర్యటించనున్నారు. అయితే గజ్వేల్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. గజ్వేల్ వస్తే అడ్డుకుంటామని ఇప్పటికే బీఆర్‌ఎస్ నేతలు (BRS Leaders)హెచ్చరించారు. దీంతో ముందస్తుగానే షర్మిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ క్రమంలో లోటస్‌పాండ్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. షర్మిల నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.


ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న దళితబంధు సెకండ్ ఫేజ్‌ను జూలై 24న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి చేతులు దులుపుకుంది. ప్రతీ నియోజకవర్గానికి 1100 మందికి మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే హుజూరాబాద్ మినహా ఎక్కడా కూడా దళితబంధు అందినటువంటి పరిస్థితి లేదు. మిగిలిన నియోజకవర్గాల్లో దళితబంధు ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పూర్తిస్థాయిలో అమలుకాని పరిస్థితి. సీఎం కేసీఆర్ (CM KCR) సొంత నియోజకవర్గంలోని పలువురు లబ్దిదారులు ఆందోళనకు దిగారు. దళితబందు పథకం అర్హులకు అందడం లేదని తీగుల్ గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించాలని షర్మిల నిర్ణయించారు. ఈరోజు ఉదయం ఉదయం 10 గంటలకు జగదేవ్ పూర్ మండలం, తీగుల్ గ్రామంలో పర్యటించాలని షర్మిల భావించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు గజ్వేల్‌లో పర్యటించేందుకు అనుమతిలేదంటూ షర్మిలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. గజ్వేల్ పర్యటనకు వస్తే షర్మిలను అడ్డుకుంటామని బీఆర్‌ఎస్ నేతలు అల్టిమేటం జారీ చేయడం.. అలాగే షర్మిల వెళితే గజ్వేల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో షర్మిల పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.

Updated Date - 2023-08-18T10:32:24+05:30 IST