YS Sharmila: ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో షర్మిల పాదయాత్ర
ABN, First Publish Date - 2023-08-15T12:11:06+05:30
వైఎస్సార్టీపీ అధినేత్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిల పేరు ఇండియన్ బుక్ రికార్డ్స్‌లో చేరింది. షర్మిల చేసిన ప్రజా ప్రస్థానం పాదయాత్రకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది.
హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధినేత్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) పేరు ఇండియన్ బుక్ రికార్డ్స్‌లో (Indian Book of Records) చేరింది. షర్మిల చేసిన ప్రజా ప్రస్థానం పాదయాత్రకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. తెలంగాణలో (Telangana state) 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసినందుకు గాను వైఎస్సార్టీపీ చీఫ్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన మొదటి మహిళగా షర్మిల రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు షర్మిలను కలిసి అభినందించి అవార్డును ప్రదానం చేశారు.
2021 అక్టోబర్ 20న తన తండ్రి వైఎస్సార్ పాదయాత్ర మొదలుపెట్టిన ప్రాంతం చేవెళ్ల నుంచే షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. దాదాపు ఏడాదిన్నర పాటు పాదయాత్ర సాగింది. పాదయాత్రలో అనేక అడ్డంకులు వచ్చినప్పటికీ వాటిని లెక్కచేయకుండా షర్మిల పాదయాత్రలో ముందుకు సాగారు. పాదయాత్రలో భాగంగా తెలంగాణ ప్రభుత్వంపై షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో షర్మిల వ్యాఖ్యలపై నర్సంపేటలో ఉద్రిక్తతలు తలెత్తడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆ తరువాత కొన్ని రోజులు పాదయాత్ర ఆగిపోగా.. తరువాత కోర్టుకు వెళ్లి పాదయాత్రకు అనుమతి తెచ్చుకున్నారు. అటు ఏపీలో కూడా షర్మిల పాదయాత్ర చేశారు. అయితే తెలంగాణలో మాత్రం సుదీర్ఘంగా 3800 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి షర్మిల ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరారు.
Updated Date - 2023-08-15T12:11:06+05:30 IST