YS Sharmila: ఆ విచ్ఛిన్నకర శక్తులు మీరే..
ABN, First Publish Date - 2023-09-11T20:24:35+05:30
దొంగే దొంగా దొంగా అన్నట్లుగా మంత్రి కేటీఆర్(Minister KTR) తీరు ఉందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి (YS Sharmila Reddy)అన్నారు.
హైదరాబాద్: దొంగే దొంగా దొంగా అన్నట్లుగా మంత్రి కేటీఆర్(Minister KTR) తీరు ఉందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి (YS Sharmila Reddy)అన్నారు. సోమవారం నాడు లోటస్పాండులో షర్మిల మీడియాతో మాట్లాడుతూ..‘‘ విచ్ఛిన్నకర శక్తులను తిప్పికొట్టాలని చెప్పే దొర గారు.. కుటిల యత్నాలతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన అసలైన శక్తులు మీరే కదా. బంగారు తునకపై 5 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసి పెట్టిన శక్తులు మీరే. రాష్ట్రం నెత్తిన అప్పులు మోపి లక్ష కోట్లు కాజేసిన శక్తులు మీరే. 9 ఏళ్లలో 8 వేల మంది రైతులను, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వందల మంది నిరుద్యోగులను పొట్టన పెట్టుకున్న అతీత శక్తులు మీరే. రాష్ట్రం పేరు చెప్పి వేల ఎకరాలు కాజేసిన భూ బకాసుర శక్తి మీరే. తెలంగాణ నినాదాన్ని వక్రీకరించి, నీళ్లను ఫాంహౌజ్కి పారించారు.నిధులను సొంత అవసరాలకు తరలించి, నియామకాలను కుటుంబానికే ఇచ్చుకున్న బంది పోట్ల రాష్ట్ర సమితినే ఈ రాష్ట్రానికి విచ్ఛిన్నకర శక్తి. ప్రజల సొమ్ముతో స్వార్థ రాజకీయలు చేస్తూ, ఉజ్వల తెలంగాణ చరిత్రను పూర్తిగా పక్కదారి పట్టించి, ఉద్యమ కారులను అణగదొక్కి,తెలంగాణ జీవనాడిని కలుషితం చేసిన మీరే అసలైన అవకాశవాదులు’’ అని వైఎస్ షర్మిలారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-09-11T20:24:35+05:30 IST