YS Sharmila: కేటీఆర్.. తెలంగాణ ద్రోహులు మీ పార్టీలోనే..
ABN , First Publish Date - 2023-09-12T21:34:40+05:30 IST
కేటీఆర్.. తెలంగాణ ద్రోహులు మీ పార్టీలోనే ఉన్నారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి (YS Sharmila Reddy) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు లోటస్‌పాండ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేటీఆర్(KTR).. ఇంకెంత కాలం తెలంగాణ(Telangana) సెంటిమెంట్‌తో ప్రజలను మోసం చేస్తావ్.అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లకు పడగలెత్తారు.
హైదరాబాద్: కేటీఆర్.. తెలంగాణ ద్రోహులు మీ పార్టీలోనే ఉన్నారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి (YS Sharmila Reddy) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు లోటస్‌పాండ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేటీఆర్(KTR).. ఇంకెంత కాలం తెలంగాణ(Telangana) సెంటిమెంట్‌తో ప్రజలను మోసం చేస్తావ్.అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లకు పడగలెత్తారు.ప్రజలు పోరాడి సాధించిన తెలంగాణలో కుటుంబమంతా పదవులు అనుభవిస్తున్నారు.హామీలు నెరవేర్చకుండా ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారు.తెలంగాణ సంపదను దోచుకుతింటున్నారు. పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి.కేటీఆర్ .. మీరు తెలంగాణ ద్రోహులు అన్న వారు ఇప్పుడు మీ క్యాబినేట్‌లో మంత్రులు.తెలంగాణ ద్రోహులని బురద చల్లడం ఆపి..మీరు అధికారంలోకి వచ్చిన దశాబ్ధ కాలంలో తెలంగాణకు ఏం చేశారో సమాధానం చెప్పాలి.ఇంకా ఎంతకాలం తెలంగాణ సెంటిమెంట్‌ను రాజేసి ప్రజలను మోసం చేసి మీ ఆస్తులు పెంచుకుంటారు?. అసలు సిసలైన తెలంగాణ ద్రోహులు మీరు.ప్రజలకు ఆ విషయం అర్థమైంది.మీకు రోజులు దగ్గరపడ్డాయి.
ప్రత్యేక రాష్ట్రం వచ్చాక మీ ఆస్తులు ఆకాశాన్ని అంటితే..తెలంగాణ మాత్రం అప్పుల కుప్ప అయింది.తెలంగాణలో నేను 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేశాను.నిరుద్యోగుల కోసం 40 రోజులకు పైగా నిరాహార దీక్షలు చేశాను.ప్రజల కోసం పోరాటం చేస్తూ మహిళనై ఉండి ఒకరోజు జైలులో కూడా ఉన్నాను.పోడు భూములకు పట్టాలు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఇవ్వకపోతే పోడు రైతుల కోసం కొట్లాడాను.రాష్ట్రంలో దళితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే దళితుల తరఫున ప్రశ్నించా. రైతులకు ఉచిత ఎరువుల హామీ ఇచ్చి నెరవేర్చలేదు.పంట సాగు నుంచి అమ్ముకునే వరకు ఇబ్బందులు పెడుతుంటే రైతుల కోసం పోరాడాం.తెలంగాణలో అన్నివర్గాల కోసం కొట్లాడాం, వారి సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించాం.రుణమాఫీ ఎందుకు చేయలేదని నిలదీశాం.సున్నా వడ్డీకే రుణాలు ఏమయ్యాయి.నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించాం. ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లేదని బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడాం.డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించాను.మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఏమయ్యాయని, పోడు భూముల పట్టాలు ఎందుకు ఇవ్వట్లేదని నిలదీశాం. ఇలా అన్నివర్గాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాగళం వినిపించాం.మీరు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఎందుకు నెరవేర్చలేదు. మరి తెలంగాణ ప్రజలకు మీరేం చేశారు?. తెలంగాణ బిడ్డలకు కేటీఆర్ ఏం చేశారో సమాధానం చెప్పాలి.తెలంగాణ బిడ్డలకు మీరు ఉద్యోగాలు ఇచ్చారా? పేద ప్రజల కోసం డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టారా? రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ చేయగలిగారా?. కేటీఆర్ తెలంగాణ ప్రజల కోసం మీరు ఏం చేశారో చెప్పాలి.మీరు తెలంగాణ కోసం చేసిందేమీ లేదు... ఏనాడూ ప్రజలను పట్టించుకున్నది లేదు.
తెలంగాణ ప్రజలు కొట్లాడితే.. వందలాది మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీరు చేసిందల్లా.. అవినీతి మాత్రమే. పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె మర్చిపోయినట్టు నాటకాలాడారు.మీరు ప్రజలను మోసగించడం తప్ప చేసిందేమీ లేదు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు.బంగారు తునక రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేశారు. 38 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్ముకున్నారు. పెద్ద పెద్ద గడీలు కట్టుకొని, కోటలు కట్టుకొని రాజుల్లాగా, దొరల్లాగా బతుకుతున్నారు.మీ కుటుంబంలో అందరూ పదవులు తీసుకుంటారు గానీ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వరు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలెన్ని.. ఇప్పటి వరకు మీరిచ్చిన ఉద్యోగాలెన్ని?. డబుల్ బెడ్ రూం ఇండ్లకు రాష్ట్రంలో ఎంతమంది ఇండ్లు లేని ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు?. మీరు ఎంతమందికి ఇండ్లు కట్టిచ్చారు?. రుణమాఫీ కోసం ఎంతమంది రైతులు ఎదురుచూస్తున్నారు?మీరు ఎంతమందికి రుణమాఫీ చేశారు?ప్రజలకు ఏమేం హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు.ఎన్ని హామీలు నెరవేర్చారు. కేటీఆర్ కు దమ్ముంటే వీటన్నింటిపై శ్వేతపత్రం విడుదల చేసి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అని షర్మిలారెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.