ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YS Sharmila: తెలంగాణలో నీటి ప్రాజెక్టుల నిర్మాణాలపై సీఎం కేసీఆర్‌కు షర్మిల సవాల్

ABN, First Publish Date - 2023-06-13T15:37:29+05:30

తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. "కష్టం ఒకరిదైతే..ప్రచారం మరొకరిది" ఈ సామెత అబద్ధాల కేసీఆర్‌కు సరిపోతుందని వ్యాఖ్యలు చేశారు. పాలమూరు కనీళ్లను చూసి సాగునీళ్ళు ఇచ్చింది వైఎస్సార్ అయితే.. తట్టెడు మట్టి మోయని కేసీఆర్.. తానే జలకళ తెచ్చినట్లు గప్పాలు కొట్టుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.

హైదరాబాద్: తెలంగాణలో నీటి ప్రాజెక్టుల నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (CM KCR) వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) సవాల్ విసిరారు. "కష్టం ఒకరిదైతే..ప్రచారం మరొకరిది" ఈ సామెత అబద్ధాల కేసీఆర్‌కు సరిపోతుందని వ్యాఖ్యలు చేశారు. పాలమూరు కనీళ్లను చూసి సాగునీళ్ళు ఇచ్చింది వైఎస్సార్ అయితే.. తట్టెడు మట్టి మోయని కేసీఆర్.. తానే జలకళ తెచ్చినట్లు గప్పాలు కొట్టుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. అందుకే అంటారు "సొమ్మొకడిది - సోకొకడిది అని" అని యెద్దేవా చేశారు. ఎన్నికల వేళ సోకు మాటలు చెప్పే దద్దమ్మ గారు - పాలమూరు ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. బీడు భూముల్లో కృష్ణా జలాలు పారించిన ఘనత ఎవరిదో చర్చకు రాగలరా అని అన్నారు. వైఎస్సార్ జలయజ్ఞం కింద వేసిన పునాదులే.. నేడు కేసీఆర్ చెప్తున్న 20 లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులు అని వైఎస్సార్టీపీ అధినేత్రి చెప్పుకొచ్చారు.

షర్మిల ఇంకా మాట్లాడుతూ... ‘‘కల్వకుర్తి ద్వారా 4 లక్షల ఎకరాలు, భీమా కింద 2 లక్షల ఎకరాలకు, నెట్టెంపాడుతో 2 లక్షల ఎకరాలు, కోయిల్ సాగర్ కింద 60 వేల ఎకరాలు, గట్టు, తుమ్మిల్ల, సంగంబండ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రిజర్వాయర్లు. వైఎస్సార్ హయాంలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తే.. మీ పదేళ్ల పాలనలో ఒక్క ఎకరాకు అదనంగా సాగునీరు ఇచ్చారా దొరగారు?.. పాలమూరు - రంగారెడ్డి పేరు చెప్పి 35 వేల కోట్లు మెక్కారే తప్పా ఒక్క ఎకరాను తడిపింది లేదు. 10 లక్షల ఎకరాలు అని చెప్పి 10 ఎకరాలు తడిపింది లేదు. 3 ఏళ్లలో ప్రాజెక్ట్ పూర్తి అని చెప్పి 9 ఏళ్లలో 35 శాతం కూడా పనులు కాలేదు. వైఎస్సార్ బ్రతికి ఉంటే పాలమూరు ప్రాజెక్ట్ పూర్తయ్యేది.10 లక్షల ఎకరాలకు ఏనాడో సాగునీరు అందేది. పాలమూరు భూములకు సాగునీళ్ళు ఇచ్చిన అపర భగీరథుడు వైఎస్సార్. వెనుక బడ్డ జిల్లాలోనూ ప్రాజెక్టుల పేరు చెప్పి కమీషన్లు దండుకున్న దొంగ కేసీఆర్. మహానేత హయాంలో "మైగ్రేషన్ వద్దని ఇరిగేషన్" చేస్తే.. నేడు ఇరిగేషన్ పక్కన పెట్టి మైగ్రేషన్ వైపే మళ్లేలా ఉంది దొర కేసీఆర్ పాలన. రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్ళైనా వలసలు ఆగలేదు. 15 లక్షల మంది పాలమూరు బిడ్డలకు బొంబాయి, దుబాయ్ కష్టాలు తీరలేదు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ మీదున్న ప్రేమ దొరకు పాలమూరు మీద లేకపాయే. ఉద్యమ సమయంలో పార్లమెంట్‌కు పంపిన గడ్డ అని ఏనాడో దొర మరిచిపోయే’’ అంటూ వైఎస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-06-13T15:37:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising