ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YS Sharmila: మీ కంటే పెద్ద వైరస్ ఏది రాదు లే!.. బీఆర్‌ఎస్ వైరస్ కంట పడితే..

ABN, First Publish Date - 2023-06-15T13:37:09+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల విమర్శలు కొనసాగుతూనూ ఉన్నాయి. ప్రతీ రోజు ఏదోఒక అంశంపై సీఎంను షర్మిల ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా... నిమ్స్‌ ఆస్పత్రి విస్తరణకు కేసీఆర్ శంకుస్థాపన చేయడంపై విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (CM KCR) వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల (YSRTP Chief YS Sharmila) విమర్శలు కొనసాగుతూనూ ఉన్నాయి. ప్రతీ రోజు ఏదోఒక అంశంపై సీఎంను షర్మిల ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా... నిమ్స్‌ ఆస్పత్రి విస్తరణకు కేసీఆర్ శంకుస్థాపన చేయడంపై విమర్శలు గుప్పించారు. ‘‘కరోనా కంటే మించిన వైరస్‌లు వస్తాయని జ్యోస్యం చెప్పే దొర.. తెలంగాణ సమాజాన్ని పట్టి పీడించే మీ కంటే పెద్ద వైరస్ ఏది రాదు లే !.. మీ దరిద్రపు పాలనే తెలంగాణ ప్రజలను పట్టి పీడించే అతి పెద్ద వైరస్. రాష్ట్ర ఖజానా ఖాళీ చెయ్యడానికే పుట్టిన మహమ్మారి మీ పాలన. ప్రజలను అప్పుల పాలు చెయ్యడానికి పట్టుకున్న వైరస్ మీరు. కరోనాతో పోరాడి నిలిచామేమో కానీ.. బీఆర్‌ఎస్ వైరస్ కంట పడితే ఖేల్ ఖతం దుకాణం బంద్. ఇక రాష్ట్రంలో వైద్యాన్ని ఉద్ధరించినట్లు ఉద్దెర మాటలు చెప్పే దొర గారు.. నిమ్స్ విస్తరణకు కొబ్బరి కాయ కొట్టారు సరే.. గత శంకుస్థాపనల సంగతి ఏంటో జర చెప్పు సారు. 15 వందల కోట్లతో ఉస్మానియా దవాఖానకు కడతామని చెప్పిన ట్విన్ టవర్స్ ఎక్కడ..?. నగరం నలుమూలల నాలుగు పెద్దాసుపత్రులు ఎక్కడ..?. అక్కడ కార్పొరేట్ వైద్యం ఏమాయే.. ఎయిమ్స్‌ను మించిన ట్రీట్మెంట్ కనపడదాయే. కొబ్బరికాయ కొట్టి 14 నెలలైనా పునాదిరాయి పడక పాయె. దొర విలాసాలకు కొత్త సచివాలయం మీద పెట్టిన శ్రద్ధ ప్రజల ఆరోగ్యం మీద లేదు. కమీషన్లకు కాళేశ్వరం మీద పెట్టిన దృష్టి వైద్యాభివృద్ధి మీద లేదు. కొబ్బరికాయలు, శంకుస్థాపనలు ఇదే మీరు 10 ఏళ్లలో సాధించిన ఆరోగ్య తెలంగాణ. మీ మహమ్మారి పాలన అంతానికి ఇంజక్షన్ రెడీ అయ్యింది దొర గారు’’ అంటూ షర్మిల వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-06-15T13:37:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising