YS Sharmila: హౌజ్‌అరెస్ట్ చేస్తే పోలీసులకు హారతిచ్చిన షర్మిల.. లోటస్‌పాండ్ వద్ద హైటెన్షన్
ABN, First Publish Date - 2023-08-18T12:26:39+05:30
లోటస్‌పాండ్ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల గజ్వేల్ పర్యటనకు అనుమతి లేదంటూ శుక్రవారం ఉదయం ఆమెను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. లోటస్ పాండ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
హైదరాబాద్: లోటస్‌పాండ్ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) గజ్వేల్ పర్యటనకు అనుమతి లేదంటూ శుక్రవారం ఉదయం ఆమెను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. లోటస్ పాండ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అయితే పోలీసుల తీరుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా వారికి హారతి ఇచ్చారు. ఆపై లోటస్‌పాండ్‌లో దీక్ష చేపట్టారు. గజ్వేల్ పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై నిరసనకు దిగారు. సాయంత్రం వరకు దీక్ష కొనసాగిస్తామని షర్మిల స్పష్టం చేశారు.
సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి?..
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కేసీఆర్‌పై (CM KCR)తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ పెద్ద పెద్ద గడీలు కట్టుకుంటూ.. పేదలకు మాత్రం కనీసం ఇళ్లు కూడా కట్టించి ఇవ్వలేదని షర్మిల మండిపడ్డారు. ప్రజలు ఏమన్నా ఓట్లు వేసే యంత్రాలా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం దొంగ హామీలు ఇచ్చి.. ఓట్లు అవ్వగా కనిపించకుండా పోతారని విమర్శించారు. కేసీఆర్ కుంభకర్ణుడిలా నిద్రపోతారని... ఎలక్షన్లకు ఆరు నెలల ముందు మాత్రమే లేస్తారని.. అప్పుడు తెలంగాణ వాదినంటూ హడవుడి చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోడానికి సిగ్గు ఉందా అని ప్రశ్నించారు. గజ్వేల్ ప్రజలు గుడిసెల్లో బతుకుతున్నారని.. దానిపై ప్రశ్నిస్తూ ఆదుకోమని తమను అడిగితే.. ఆ ఊరికి వెళ్లే తమను హౌజ్ అరెస్ట్ చేశారని విరుచుకున్నారు. బీఆర్‌ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్క పధకమైనా అమలు చేశారా అని నిలదీశారు. దళితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చారా అని అడిగారు. దళితబంధు స్కీమ్‌లో అవకతవకలు జరుగుతున్నాయని అన్ని నియోజవర్గాల్లో చెబుతున్నారన్నారు. దళితబంధు స్కీమ్‌లో అవకతవకలపై ఇంటలిజెన్స్ రిపోర్ట్ సీఎం వద్ద ఉందని, దీనిపై సీఎం కేసీఆర్ స్వయంగా ఎమ్మెల్యేలను కూర్చొబెట్టుకుని మాట్లాడారంటే.. అందులో అవినీతి జరిగుతుందని సీఎంకు తెలిసినట్టే కదా అని అన్నారు. ఇంత జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని వైఎస్సార్టీపీ అధినేత్రి ప్రశ్నించారు.
మేనిఫెస్టో అనే పదానికి అర్ధం లేకుండానే చేశారని అన్నారు. దళితులకు దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి దళితబంధు వరకు అన్నీ మోసాలే చేశారని విమర్శలు గుప్పించారు. సీఎం పదవిలో కొనసాగే అర్హత ఉందా అని ప్రశ్నించారు. కేవలం బీఆర్‌ఎస్ పార్టీ వారికి మాత్రమే దళితబంధు ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 17లక్షల మంది దళితులు ఉంటే కేవలం 36వేల మందికి మాత్రమే దళితబంధు వచ్చిందని.. ఇంక మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దళితబంధు స్కీమ్ ఎమ్మెల్యేల చేతిలో ఉండటానికి వీల్లేదన్నారు. దళితబంధు స్కీమ్ సరిగ్గా అమలు జరగడం లేదని, ఈ పధకం విధివిధానాలు మొత్తం ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. ‘‘హుజూరాబాద్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం దళితబంధును అమలు చేసి.. మీ మగతనాన్ని నిరూపించుకోవాలి’’ అంటూ వైఎస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2023-08-18T13:09:12+05:30 IST