YS Sharmila: మీది భరోసానిచ్చే సర్కార్ కాదు... రైతుకు బేడీలు వేసే సర్కార్.. షర్మిల విసుర్లు

ABN , First Publish Date - 2023-06-14T15:12:49+05:30 IST

ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్పుపై ఆందోళన చేసిన యాదాద్రి జిల్లా రాయగిరి రైతులను పోలీసులు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకురావడంపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దొర పాలనలో న్యాయమడిగిన అన్నదాతకు తప్పని సంకెళ్లు అంటూ విరుచుకుపడ్డారు. "ఆప్ కి బార్ కిసాన్ సర్కార్ " అంటే ఇదేనా దొరగారు? అంటూ ప్రశ్నించారు.

YS Sharmila: మీది భరోసానిచ్చే సర్కార్ కాదు... రైతుకు బేడీలు వేసే సర్కార్.. షర్మిల విసుర్లు

హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్పుపై ఆందోళన చేసిన యాదాద్రి జిల్లా రాయగిరి రైతులను పోలీసులు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకురావడంపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దొర పాలనలో న్యాయమడిగిన అన్నదాతకు తప్పని సంకెళ్లు అంటూ విరుచుకుపడ్డారు. "ఆప్ కి బార్ కిసాన్ సర్కార్ " అంటే ఇదేనా దొరగారు? అంటూ ప్రశ్నించారు. నమ్ముకున్న భూమిని ఇచ్చేది లేదంటే బేడీలు వేయడమా మీరిచ్చే భరోసా అని వైఎస్సార్టీపీ అధినేత్రి నిలదీశారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ... ‘‘మీ బందిపోట్లను ప్రశ్నిస్తే రైతు అని చూడకుండా జైలుకు పంపడమేనా మీ నినాదం ?. మద్దతు ధర అడిగితే సంకెళ్లు. పంట కొనండని అడిగితే సంకెళ్లు. భూములు పోయాయని అడిగితే సంకెళ్లు. భూములు ఇవ్వం అని చెప్పినా సంకెళ్లు. ఆక్రందన, ఆవేదన, ఆందోళన ఏది చూపినా రైతుకు దొర ఇచ్చే గిఫ్ట్ సంకెళ్లు. కిసాన్ బరోసా అని, వచ్చేది రైతు ప్రభుత్వమని, చెప్పుకొనేందుకు సిగ్గుపడు దొర సిగ్గుపడు. మీది భరోసానిచ్చే సర్కార్ కాదు. "రైతుకు బేడీలు వేసే సర్కార్". రైతును బర్బాద్ చేసే సర్కార్. రారాజును తీవ్రవాదిగా చూసే సర్కార్. రైతులను ఉగ్రవాదుల్లా చిత్రీకరించి సంకెళ్లు వేసిన కేసీఆర్ ఒక తాలిబానా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం వేశారు.

షర్మిల ఇంకా ఏమన్నారంటే... ‘‘అన్నం పెట్టే రైతన్నకు బేడీలు వేసిన కనికరం లేని కసాయి ఈ కేసీఆర్. దేశ చరిత్రలో రైతులను 3 సార్లు జైలుకి పంపిన చరిత్ర నీదే దొర. భూములు పోతున్నాయి మహాప్రభో అని నిరసన తెలిపితే అరెస్టులు చేయిస్తావా?. ట్రిపుల్ఆర్ అలైన్‌మెంట్ అన్యాయమని అడిగితే జైల్లో పెట్టిస్తవా?.. అరెస్ట్ చేయాల్సింది రైతులను కాదు. భూములు మింగే దొర కేసీఆర్‌ను. బీఆర్ఎస్ దొంగలకు అనువుగా ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్చిన కేసీఆర్‌ను జైలుకు పంపాలి. న్యాయమని అడిగిన రైతులకు బేడీలు వేస్తున్న నీ నియంత పాలనకు రోజులు దగ్గర పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో ఆ సంకెళ్లు నీకే వేసేందుకు రైతులంతా సిద్ధంగా ఉన్నారు కేసీఆర్ గారు’’ అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.

Updated Date - 2023-06-14T15:13:36+05:30 IST